ఒక్కోసారి అలా ఉండటం ఎంతో బాగుంటుంది.. అనుపమా అదిరిపోయే పిక్
అనుపమా పరమేశ్వరన్.. ఈ పేరు వింటే కుర్రాళ్ల కళ్లలో లైట్లు వెలుగుతాయి. ప్రేమమ్ సినిమాతో యూత్‌ను ప్రేమలో పడేసిన అనుపమ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. కేరళ అమ్మాయిలు తెలుగు తెరపై ఎన్నో మ్యాజిక్‌లు క్రియేట్ చేయగా.. అనుపమ తనదైన స్టైల్లో అందర్నీ ఆకట్టుకుంది.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా..
అనుపమ నటించిన సినిమాలు అంత పెద్దగా సక్సెస్ కాలేదు. అఆ సినిమాలో అనుపమా పాత్రను చూసి ఎంతోమంది ఆమెను ఇష్టపడ్డారు. తరువాత చేసిన సినిమాలు కమర్షియల్ సక్సెస్ కాకపోయినా అనుపమ క్రేజ్ మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది.

రామ్‌తో వరుసగా..
ఎనర్జిటిక్ రామ్‌తో వరుసగా రెండు ప్రాజెక్ట్‌లను చేసింది. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే అంటూ రెండు చిత్రాలను చేసింది.. కానీ అవి కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాలేదు. కానీ అనుపమ నటనకు, లుక్స్‌కు మంచి ప్రశంసలే లభించాయి. శతమానం భవతి సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుని పేరును తీసుకొచ్చింది.

సోషల్ మీడియాలో హవా...
సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అనుపమా తన ఫోటోషూట్‌లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా హలో, షేర్ చాట్, టిక్ టాక్, డబ్ స్మాష్‌లాంటి వాటిలో దూసుకుపోతూ ఉంటుంది.

డబ్ స్మాష్ అంటే క్రేజీ..
ఈ మధ్య కాలంలో యూత్ అంతా టిక్ టాక్, డబ్ స్మాష్ లాంటి వాటికి బాగా అలవాటు పడ్డారు. తమకు నచ్చిన డైలాగ్‌లను తమ స్టైల్లో చెప్పేసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. ఇలా చేయడం అనుపమకు సరదా. అందుకే ఆ ఫ్లాట్ ఫామ్‌లో అనుపమకు ఉండే ఫాలోయింగే వేరు.
తాజాగా సంప్రదాయ దుస్తులతో ఫోటో...
అనుపమ ఎప్పుడూ హద్దులు మీరి ఎక్స్‌పోజింగ్ చేసింది లేదు. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే అనుపమా.. ఎక్కువగా చీరకట్టులోనో లేదా పంజాబీ డ్రెస్‌లోనో కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాషన్ డ్రెస్‌లు వేసినా.. హద్దులు మీరదు. తాజాగా చీరకట్టుతో ఉన్న పిక్‌ను పోస్ట్ చేస్తూ.. కొన్ని సమయాల్లో పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో ఉండటం కూడా కూల్‌గా ఉంటుంది కదూ..? అంటూ పోస్ట్ చేసింది. ఈ పిక్‌కు, అనుపమ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.


Click it and Unblock the Notifications











