twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anupama Parameswaran: కార్తికేయ 2 హిట్టు.. అయినా సంతోషం కంటే బాధే ఎక్కవగా ఉంది

    |

    మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ చిత్రం ప్రేమమ్​తో పేరు తెచ్చుకున్న అనుపమ తెలుగులో నితిన్​ అ ఆ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. చేసిన తొలి తెలుగు చిత్రంలోనే సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడంతో అనేక మంది ప్రేక్షకులను ఆకర్షించింది ఈ అమ్మడు. తర్వాత వచ్చిన శతమానం భవతి, నాగ చైతన్య ప్రేమమ్​, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం చిత్రాలతో అలరించింది. తర్వాత రౌడీ బాయ్స్​​ సినిమాలో లిప్​ కిస్​ సీన్లతో యూత్​ను అట్రాక్ట్​ చేసిన కొంతవరకు విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ కేరళ కుట్టి నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ప్రస్తుతం విజయపథంలో దూసుకుపోతోంది. అయితే సినిమా సక్సెస్​ అయినా తను మాత్రం ఆనందంగా లేనంటుంది అనుపమమ పరమేశ్వరన్​.

    యంగ్​ హీరో నిఖిల్​తో కార్తికేయ 2 సినిమా ద్వారా జోడీ కట్టింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సీక్వెల్​గా తాజాగా రూపొందిందే కార్తికేయ 2. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. కార్తికేయ 2 చిన్న సినిమా అయినా ప్రేక్షకుల్లో ఒక క్రేజ్​ సంపాదించుకుంది. పలు కారణాల వల్ల అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన కార్తికేయ 2 చిత్రం ఫైనల్​గా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే మంచి హిట్​ టాక్​ తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది.

    Anupama Parameswaran Shocking Comments In Karthikeya 2 Success Meet

    తెలుగులోనే కాకుండా నార్త్​లో కూడా తన హవా చూపిస్తూ మరోసారి తెలుగు సినిమా సత్తా చాటుతోంది కార్తికేయ 2. ఈ సినిమాను మొదటగా హిందీలో 50 థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారట. కానీ హిట్​ టాక్​ రావడంతో థియేటర్ల సంఖ్య 200కు చేరింది. తర్వాత 700 థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ప్రదర్శితమవుతోంది కార్తికేయ 2. అంతేకాకుండా అక్కడి స్టార్​ హీరోల సినిమాను తీసేసి మరి కార్తికేయ 2 చిత్రాన్ని వేయాలని ఉత్తరాది ప్రేక్షకులు కోరడం విశేషం. ఇంత పెద్ద సక్సెస్​ సాధించిన కార్తికేయ 2 మూవీ యూనిట్​ ఇటీవల సక్సెస్​ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్​ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    'కార్తికేయ 2 సినిమా మంచి విజయం సాధించినప్పటికీ తనకు ఆనందంగా లేదంటూ షాకింగ్​ కామెంట్స్ చేసింది ఈ కేరళ కుట్టి. నాకెప్పుడు కూడా స్టేజ్​పై టెన్షన్​ ఉండదు. కానీ ఇవాళ స్టేజ్​పైకి వస్తుండగానే షివరింగ్​ స్టార్ట్​ అయింది. ఈ సినిమా హిట్​ అయిందిగా, నువ్వెందుకు హ్యాపీగా లేవని నా స్నేహితులు అడుగుతున్నారు. ఈ చిత్రం సక్సెస్​ కొట్టినప్పటికీ కార్తికేయ 2 ప్రయాణం అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. ఆ బాధ వల్లే నేను ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్​ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి మూవీలో నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే నన్ను భరించినందుకు చందూ మొండేటి గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు' అని కార్తికేయ 2 సక్సెస్​ మీట్​లో అనుపమ పరమేశ్వరన్​ చెప్పుకొచ్చింది.

    ఈ సక్సెస్ మీట్​లో నిఖిల్​, చందూ మొండేటి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్​ రాజు, డైరెక్టర్​ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్​ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. కాగా కార్తికేయ 2 సినిమాను క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ బ్యానర్స్​పై టి.జి. విశ్వ ప్రసాద్​, అభిషేక్​ అగర్వాల్​ సంయుక్తంగా నిర్మించారు. ఇంతకుముందు కశ్మీర్ ఫైల్స్​ వంటి చిత్రాన్ని నిర్మించి అభిషేక్​ అగర్వాల్​ నిర్మాతగా విజయం సాధించిన విషయం తెలిసిందే.

    English summary
    Anupama Parameswaran Shocking Comments In Nikhil Starrer Karthikeya 2 Success Meet And Said She Is Sad Still Movie Gets Success
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X