పబ్లిసిటీ పిచ్చిదని అన్నారు.. అందుకే అక్కడ సినిమాలు చేయట్లే: అనుపమ
మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సొంత భాషలో కంటే ఇతర బాషల్లోనే ఎక్కువగా వర్క్ చేస్తోంది. చాలా వరకు తెలుగు తమిళ్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. సాయి పల్లవితో పాటు ప్రేమమ్ సినిమాతో ఒకేసారి ఇండస్ట్రీలో క్రేజ్ అందుకున్న అనుపమ అవకాశాలు అయితే బాగానే అందుకుంటోంది గాని ఇంకా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవడం లేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు సొంత భాషలో ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపింది.

సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి..
ప్రేమమ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనుపమ బాక్సాఫీస్ హిట్ అందుకుంది. అయితే ఆ సినిమాతో ఎక్కువగా సాయి పల్లవి క్రేజ్ అందుకుంది. అప్పట్లో సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి ఆమె ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. అనంతరం జేమ్స్ అండ్ ఆలిస్ అనే సినిమా కూడా చేసిన అనుపమ అప్పుడు ఇంకా ఎక్కువ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రమోషన్స్ పిచ్చిది అంటూ..
చేస్తోంది చిన్న రోల్స్ అయినా కూడా ఆమె స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో డబ్బా కొట్టుకుంటోంది. ప్రమోషన్స్ పిచ్చిది అంటూ అనుపమపై ఒక రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయంపై ఇటీవల స్పందించిన అనుపమ ఆ విషయం తనను ఎంతగానో బాధించినట్లు తెలిపింది. ఆ తరువాత తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ తెలిపింది.

హీరోయిన్ అన్నంత రేంజ్ లో
అనుపమ మాట్లాడుతూ.. నేను ఏ సినిమా చేసిన ప్రమోషన్స్ విషయంలో ముందుంటాను. అందుకే మొదట్లో మలయాళం సినిమాల కోసం వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో నాపై అక్కడి ఆడియెన్స్ కొందరు ట్రోల్ చేశారు. సినిమాలో కనిపించేది కొంత సేపు అయినా మెయిన్ హీరోయిన్ అన్నంత రేంజ్ లో పబ్లిసిటీ చేసుకుంటోందని కామెంట్స్ చేశారు.

అందుకే మలయాళం సినిమాలు తగ్గించేశాను
అప్పటి నుంచి మలయాళం సినిమాలు చాలా వరకు తగ్గించేశాను. వీలైతే మెయిన్ లీడ్ లో నటించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా అనుపమ పరమేశ్వరన్ వివరణ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ గత ఐదేళ్లలో మొత్తంగా 13 సినిమాలు చేస్తే అందులో కేవలం మూడు మలయాళం సినిమాలే చేసింది. నెక్స్ట్ మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











