twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుపమ పరమేశ్వరన్ అందాల విందు: చీర కొంగును పక్కకు జరిపి మరీ.. తొలిసారి అలా రెచ్చిపోయిన బ్యూటీ

    |

    అనుపమ పరమేశ్వరన్.. తెలుగు వాళ్లకు ఈ పేరుతో పరిచయం అవసరం లేదు. అంతలా ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో మాయ చేస్తుందామె. మన భాషలో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును అందుకుంది. అదే సమయంలో అవకాశాలనూ దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో విచిత్రమైన పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తొలిసారి అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!

    అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఫేమస్ అయింది

    అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఫేమస్ అయింది

    నితిన్ హీరోగా నటించిన 'అఆ' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అప్పటి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలు చేసింది.

    భారీ హిట్ తర్వాత.. రెండు సినిమాల్లో ఆఫర్

    భారీ హిట్ తర్వాత.. రెండు సినిమాల్లో ఆఫర్

    తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అందుకే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చివరిగా 2019 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో పాటు నిఖిల్ '18 పేజెస్'లోనూ నటిస్తోందీ కేరళ కుట్టి.

    అక్కడ కూడా ఫుల్ బిజీ.. విడుదలకు సిద్ధం

    అక్కడ కూడా ఫుల్ బిజీ.. విడుదలకు సిద్ధం

    అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయకున్నా.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుసగా ప్రాజెక్టులను చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తున్న అనుపమ.. మలయాళంలో 'కురుప్పు', తమిళంలో 'తల్లి పొగతే' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

    అతడితో ప్రేమాయణం... పెళ్లి... అలా ఆగింది

    అతడితో ప్రేమాయణం... పెళ్లి... అలా ఆగింది

    అనుకోకుండా చేసిన ఓ పని వల్ల అనుపమ పరమేశ్వరన్ చిక్కుల్లో పడింది. దీనికి కారణం ఆమె టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు రావడమే. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ మధ్యనే ఆ ఇండియన్ క్రికెటర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.

    అందులో ఫుల్ బిజీగా... అన్నీ చెబుతోందిగా

    అందులో ఫుల్ బిజీగా... అన్నీ చెబుతోందిగా

    చేతిన నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం కొంత కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో అనుపమను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

    అనుపమ పరమేశ్వరన్ అందాల విందుతో

    అనుపమ పరమేశ్వరన్ అందాల విందుతో

    సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది అనుపమ పరమేశ్వరన్. ఇప్పటి వరకూ ఎప్పుడూ హాట్ షో జోలికి పోకుండానే ఆమె కనిపించింది. అయితే, తాజాగా నల్ల చీరలో దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. అంతే.. కేవలం కొన్ని గంటల్లోనే వీటికి లక్షల్లో లైకులొచ్చాయి. దీనికి కారణం అందులో ఆమె అందాల విందు చేయడమే.

    చీర కొంగును పక్కకు జరిపి మరీ.. ఫస్ట్ టైం

    చీర కొంగును పక్కకు జరిపి మరీ.. ఫస్ట్ టైం

    అనుపమ పరమేశ్వర్ షేర్ చేసిన ఈ ఫొటోల్లో చీర కొంగును పక్కకు జరిపి కనిపించింది. తద్వారా ఆమె అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. నిజానికి గతంలో ఆమె ఇలాంటి ఫొటోలను షేర్ చేయలేదు. ఫస్ట్ టైం హాట్ ఫోటోషూట్‌ను వదిలింది. ఈ కారణంగానే వీటికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అందుకే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Anupama Parameshwaran is one of those actresses who enjoy good craze among the audiences. But, she did not get the chance to romance with top stars on the screen. Now, Anupama Parameswaran send Love message In her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X