మరోసారి స్టార్ డైరెక్టర్ దృష్టిలో పడిన అనుపమ పరమేశ్వరన్

టాలీవుడ్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ బ్యూటీ ఎక్కువగా తెలుగు సినిమాలలోనే కనిపిస్తోంది. ఎలాగైనా స్టార్ హీరోలతో అవకాశం దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని అనుకుంటోంది గాని ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ ప్రేమమ్ బ్యూటీకి మళ్ళీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దృష్టిలో పడినట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదివరకే అఆ సినిమా ద్వారా మాటల మాంత్రికుడితో కలిసి పని చేసిన అనుపమ ఆ తరువాత మళ్ళీ కలవలేదు. ఆ మధ్య త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి గాని అవన్నీ రూమర్స్ అని తెలిపోయాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ త్రివిక్రమ్ యువ హీరో రామ్ తో ఒక మీడియం బడ్జెట్ సినిమాను చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే కథపై ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. స్రవంతి రవి కిషోర్ ఆ సినిమాను నిర్మించనున్నారు.

Anupama parameswaran talks for trivikram upcoming movie

అయితే ఆ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్ కూడా సినిమాకు అవసరమయ్యే అవకాశం ఉందట.

నిజంగా ఈ ప్రాజెక్ట్ గనక స్టార్ట్ అయితే అనుపమ కెరీర్ కి మరో మంచి బౌన్స్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని చెప్పవచ్చు. ఇక త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టు ఆలస్యం అయ్యేలా ఉందని రామ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X