‘నడుము పట్టుకోమంటే .. ఆ హీరో స్క్రిప్ట్ మార్చేసి, చేతితో అసభ్యంగా ’
ఎన్ని సంఘటనలు తెరపైకి వస్తున్నా, పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా సినీరంగంలో మహిళలు వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. నిత్యం ఎవరో ఒక నటి తమకు జరిగిన అవమానాలను, వేధింపులను, వివక్షను పంచుకుంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ వ్యహారాలు నేటికీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో హీరో తనతో హద్దుమీరి ప్రవర్తించినట్లు సినీ నటి అనుప్రియ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
క్యాస్టింగ్ కౌచ్, వేధింపులు అనేది సినీ పరిశ్రమకు కొత్త కాదు. మీటూ ఉద్యమం సమయంలో ఎంతో మంది మహిళా నటులు తమపై జరిగిన దారుణాలను పంచుకోవడంతో చిత్రసీమ ఉలిక్కిపడింది. ఇక గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలోని వేధింపుల వ్యవహారాన్ని జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టింది. ఆ తర్వాత రోజుకొక నటీమణి వేధింపులు, అత్యాచార ఘటనలను వెల్లడించారు. తమకు కూడా హేమ కమిటీ లాంటి దానిని ఏర్పాటు చేయాలని పలు ఇండస్ట్రీలకు చెందిన మహిళా నటులు ప్రభుత్వాలను కోరారు.

సినిమాల చిత్రీకరణల సమయంలో కొందరు హీరోలు .. మహిళా నటుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలెన్నో. షూటింగ్ పేరుతో మహిళా నటులను అసభ్యంగా తాకడం, వారు ఇబ్బందిపడేలా వ్యవహారించడం వంటి ఘటనలెన్నో బయటికి వచ్చాయి. పాత్రకు అవసరమైనంత మేర మాత్రమే నటించే వారు కొందరైతే.. ఇంకొందరు నటన పేరుతో అమ్మాయిలను తాకడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటీవల హీరోయిన్ సయాని గుప్తా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఓ ఇంటిమేట్ సీన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. మార్గరీటా విత్ ఏ స్ట్రా సినిమాలో ఓ ముద్దు సీన్‌లో డైరెక్టర్ కట్ చెప్పినా తనతో నటించిన హీరో మాత్రం ఆపకుండా ముద్దు పెడుతూనే ఉన్నాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక తాజాగా ఈ లిస్ట్‌లోకి సినీ నటి అనుప్రియా గోయెంకా చేరింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. మోడల్‌గా కోక్, గార్నియర్, స్టే ఫ్రీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, పెప్పర్ ఫ్రై, వోడాఫోన్ వంటి టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. 2013లో మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత తన ఫోకస్ హిందీ ఇండస్ట్రీపై పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టైగర్ జిందా హైలో నర్స్ పూర్ణిమగా, పద్మావత్‌లో మహారాణి నాగమతిగా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుప్రియ మాట్లాడుతూ.. ఓ సినిమాలో ముద్దు సీన్ సందర్భంగా తాను ఎంతో ఇబ్బందిపడినట్లు తెలిపింది. ఈ సినిమాలో హీరో స్క్రిప్ట్ ప్రకారం తన నడుము పట్టుకోవాలని .. కానీ అతను మాత్రం స్క్రిప్ట్‌లో ఉన్నట్లు కాకుండా నడుముకు బదులు తన శరీరంలోని మరో చోట అసభ్యంగా తాకినట్లు బాంబు పేల్చింది. ఊహించని ఘటనతో షాకైన తాను ఎంతో ఇబ్బందిపడి అక్కడి నుంచి వెళ్లిపోయానని.. ఈ సీన్ విషయంగా ఆ నటుడిని ప్రశ్నించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాతి రోజున అదే షాట్ తీయగా ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదని అనుప్రియ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారగా.. అనుప్రియను టార్చర్ చేసిన ఆ నటుడు ఎవరు? ఏ సినిమా సందర్భంగా ఇలాంటి ఘటన జరిగిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











