కంగన రనౌత్ అవుట్.. దీపిక పదుకోన్ ఎంట్రీ.. కమాల్ చేసిన దర్శకుడు
నిత్యం వివాదాల్లో కేంద్ర బిందువు అవుతున్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్‌కు భారీ షాక్ తగిలింది. దర్శకుడు అనురాగ్ బసు నిర్మిస్తున్న ఇమాలి చిత్రం నుంచి కంగన రనౌత్ తప్పించడం బాలీవుడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. కంగన ఇమాలి చిత్రం చేయడం లేదు. డేట్స్ సమస్య వల్ల సినిమా చేయడానికి కుదరడం లేదు అని అనురాగ్ బసు వెల్లడించారు.
ఇమాలి సినిమాను మేము నవంబర్‌లో ప్రారంభించాలని అనుకొంటున్నాం. అదే సమయంలో మణికర్ణిక, పంగా చిత్రాలతో కంగన బిజీగా ఉన్నారు. ఇమాలి తర్వాత నేను మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంటాను. అందుకే కంగన డేట్స్ సమస్య వల్ల తప్పుకొన్నారు అని అనురాగ్ బసు తెలిపారు.

కంగన పాత్రకు దీపిక పదుకోన్‌ను సంప్రదించాం. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీపికను స్వయంగా నేను కలిశాను. ఇంకా ఆమె తుది నిర్ణయం తెలియజేయలేదు. అందువల్ల ఇప్పుడే దీపికా ఇమాలిలో నటిస్తుందా అని నేను క్లారిటీ ఇవ్వలేను అని అనురాగ్ అన్నారు.
మణికర్ణిక తర్వాత కంగన రనౌత్ తన జోరును పెంచింది. రాజ్ కుమార్ రావుతో కలిసి మెంటల్ హై క్యా అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే కబాడ్డీ క్రీడ నేపథ్యంగా పంగా అనే చిత్రంలో కూడా కంగన నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











