‘నిశ్శబ్ధం’గా 6 నెలలు కష్టపడ్డ అనుష్క... దర్శకుడే ఆశ్చర్యపోయాడు!
అనుష్క శెట్టి నటిస్తున్న 'నిశ్శబ్ధం' మూవీ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 12న విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని సాక్షి అనే ఆర్టిస్టుగా కనిపించబోతోంది. తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో ఆమె నటించారు.
ఈ సినిమా కోసం అనుష్క ఆరు నెలల పాటు కష్టపడి సంజ్ఞ(సైగలు)భాషతో పాటు, పేయింటింగ్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్టు పాత్ర పోషించడానికి ఆమె ఎలా ప్రిపేర్ అయ్యారో వెల్లడించారు. అనుష్క డెడికేషన్ చూసి తానే ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.

ఆరు నెలల పాటు అనుష్క కష్టపడి సాధన చేశారు
"ఈ పాత్రను పోషించడానికి అనుష్క పెయింటింగ్, సంజ్ఞ భాష నేర్చుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకులను హైర్ చేసుకున్నాం. వారు ఆరు నెలల పాటు ప్రతి రోజూ ఆమెకు ఈ రెండు అంశాలపై శిక్షణ ఇచ్చారు'' అని హేమంత్ మధుకర్ చెప్పుకొచ్చారు.

అనుష్క యాక్షన్ సన్నివేశాలు
ఈ చిత్రంలో అనుష్క కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చేసినట్లు దర్శకుడు హేమంత్ మధుకర్ తెలిపారు. నిశ్శబ్ధం థ్రిల్లర్ జేనర్లో రూపొందుతున్న చిత్రం, ఇందులో మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్, అంజలి, షాలిని పాండే ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి
"ఈ చిత్రం పూర్తిగా యుఎస్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులోని అంశాలు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా చేస్తాయి. అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ లుక్స్ త్వరలో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాము'' అన్నారు.

ప్యాన్ ఇండియా చిత్రంగా ‘నిశ్శబ్ధం'
‘నిశ్శబ్ధం' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత అనుష్కకు ప్యాన్ ఇండియా వైడ్ క్రేజ్ రావడంతో ఈ మూవీని తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











