‘సైరా నరసింహారెడ్డి’ అనుష్క పాత్ర ఏమిటో తెలిసిపోయింది...
హీరోయిన్ అనుష్క మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీలో అతిథి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది? అనే విషయాన్ని చిత్ర బృందం సస్పెన్స్‌గానే ఉంచింది.
తాజాగా సైరాలో ఆమె పాత్రకు సంబంధించిన న్యూస్ లీక్ అయింది. ఇందులో అనుష్క... స్వాతంత్ర్య సమరయోధురాలు, 1857లో బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో కనిపించబోతోందట. ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్ర ద్వారానే 'సైరా నరసింహారెడ్డి' స్టోరీ నేరేట్ చేస్తూ సినిమా మొదలవుతుందట.
మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రకు అనుష్క తప్ప మరెవరూ సూటవ్వరని డిసైడ్ అయిన చిత్ర బృందం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఇందులో అనుష్క తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పిందట.

కాగా.. ఇటీవల అనుష్క 'సైరా' షూటింగులో గాయపడ్డట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాలుకు ఫ్యాక్చర్ అయిందని, ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా చికిత్స తీసుకుందని పుకార్లు షికార్లు చేశఆయి. జాతీయ మీడియాకు చెందిన వెబ్ సైట్లలో సైతం అనుష్క గాయపడ్డట్లు ప్రచారం జరుగడంతో.... ఆమె స్పందించారు. 'నేను ధృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాను. సీటెల్‌లో జరుగుతున్న షూటింగులో హ్యాపీగా పాల్గొంటున్నాను. లవ్ యూ ఆల్' అంటూ తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.
అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారా హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా కోసం అనుష్క స్లిమ్ లుక్‌లోకి మారింది. బరువు తగ్గం కోసమే ఆమె సంవత్సరకాలం సమయం తీసుకున్నారు. 'సైలెన్స్' చిత్రాన్ని కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











