పెళ్లి చేస్తారు, గర్భవతిని చేస్తారు: అసలు విషయం చెప్పమంటే అనుష్క ఇలా అన్నారేంటి?
బాలీవుడ్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ వైపు తన తాజా చిత్రం, షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన 'జీరో' ప్రమోషన్లలో బిజీగా గడుపుతుంటే ఈ వార్తలు ఆమెను ఇబ్బంది పెట్టాయని చెప్పక తప్పదు.
'జీరో' మూవీ ప్రమోషన్లలో అనుష్క శర్మ లూజ్ ఔట్ ఫిట్స్ ధరించడం, బేబీ బంప్ ఉన్నట్లు కనిపించడమే ఈ వార్తలు తెరపైకి రావడానికి కారణం. దీనిపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. మీరు గర్భం దాల్చిన మాట నిజమేనా? అని ఓ ఆంగ్లప్రతిక ప్రతినిధి ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించారు.

ఆ వార్తల్లో నిజం లేదు
గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చిన అనుష్క ఈ న్యూస్ విన్న తర్వాత చాలా సిల్లీగా అనిపించిందని తెలిపారు. పని పాటా లేనవారే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారని వ్యాఖ్యానించారు.

పెళ్లి విషయాన్ని దాచగలం, ప్రెగ్నెన్సీ దాచలేం
ఒక వేళ గర్భం దాల్చిస్తే అలాంటి విషయాలు ఎలా దాచగలం? మనం పెళ్లి చేసుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచగలం.. కానీ ప్రెగ్నెన్సీ వస్తే దాచలేం. అలా చేయడం అసలు సాధ్యం కాదు అని అనుష్క శర్మ అన్నారు.

పెళ్లి చేస్తారు, గర్భవతిని చేస్తారు
ప్రతి నటికీ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని నేను భావిస్తున్నాను. మీరు పెళ్లి చేసుకోకున్నా ఇలాంటి వార్తలతో పెళ్లి చేస్తారు..... గర్భం దాల్చకున్నా ఇలాంటి పుకార్లతో తల్లిని చేస్తారు అని అనుష్క శర్మ వ్యాఖ్యానించారు.

వాటిని పట్టించుకోను
సినిమా రంగంలో ఉన్నపుడు ఇలాంటి రూమర్స్ సహజమే. నేను వాటిని పెద్దగా పట్టించుకోను, నా దృష్టికి వచ్చినపుడు విని నవ్వుకుంటాను. పట్టించుకుంటూ పోతే సమయం వృధా తప్ప మరేమీ కాదు అని అనుష్క శర్మ స్పష్టం చేశారు.

డిసెంబర్ 11న ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ
కాగా.... అనుష్క శర్మ-విరాట్ కోహ్లి డిసెంబర్ 11న తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నారు. విరాట్ ప్రస్తుతం క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉండటంతో అక్కడే వీరు సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications











