T20 World Cup Win: 17 ఏళ్ల తర్వాత విజయం.. ఆ ముగ్గురికి విరాట్ ముద్దులు.. అనుష్క శర్మ కంటతడి!
టీ20 వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో భారతీయులందరూ గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించి విజయాన్ని చేజిక్కించుకోవడంతో అభిమానులు పండగా చేసుకొంటున్నారు. కానీ విరాట్ కోహ్లీ భార్య, అనుష్క శర్మ , ఆయన కూతురు వమికా మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అనుష్క ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ..
మైదానంలో కొన్ని సంవత్సరాలుగా సెంచరీలతో ప్రత్యర్థి జట్లకు గుండె దడ పుట్టించడమే కాకుండా పరుగుల వరదను పారించిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. బార్బడోస్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఆయనకు చివరి మ్యాచ్. దాంతో ఆయన కూతురు వమికా, భార్య ఉద్విగ్నానికి లోనయ్యారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే.. నా కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్. టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై. భారత్ మ్యాచ్ గెలిచినా.. గెలవకపోయినా నేను ఈ మ్యాచ్ చివరిదని భావించాను. నా చివరి మ్యాచ్ నాకు ప్రత్యేకమైంది. భారత్‌కు అద్బుతమైన విజయం దక్కింది అంటూ విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
భారత్‌కు విజయం దక్కగానే వమికా కంటతడి పెట్టింది. ఆటగాళ్లను ప్రతీ ఒక్కరు కౌగిలించుకొని అభినందించడం చూసి ఎమోషనల్ అయింది. టీవీ ముందు చూస్తూ ఆనందంతో ఏడ్చింది. నాకు ప్రియాతిప్రియమైన వ్యక్తిని 150 కోట్ల మంది కౌగిలిలో ప్రేమతో బంధించారు. భారత్ సంచలన విజయం సాధించింది. అద్డుతమైన గెలుపు. ఛాంపియన్స్‌కు కంగ్రాట్స్ అంటూ అనుష్క శర్మ పోస్టు ద్వారా భావోద్వేగానికి గురయ్యారు.
టీ20 వరల్డ్ కప్ అందుకొన్న వెంటనే విరాట్ కోహ్లీ తన భార్య, కూతురు, కుమారుడితో మాట్లాడారు. వీడియో కాల్ చేసి తన సంతోషాన్ని పంచుకొంటూ కనిపించారు. అనుష్కకు, తన కుమారుడు అకాయ్, వమికాకు ముద్దులు కురిపించాడు.
ఇదిలా ఉండగా, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తనకు చివరి మ్యాచ్‌గా నిలిచిన ఆటలో విరాట్ కోహ్లీ జట్టుకు అండగా నిలిచాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేసి.. జట్టుకు విజయాన్ని అందించడంలో తన వంతు పాత్రను పోషించాడు. విరాట్ ఆడిన తీరుకు క్రికెట్ అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











