అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ అరుదైన బహుమతి.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత పెళ్లి వేడుక అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఇటలీలో పెళ్లి చేసుకోవడం మీడియాలో అత్యంత ప్రయారిటీగా మారింది. అయితే పెళ్లికి సంబంధించిన ఖర్చు. పెళ్లి సమయంలో అనుష్కకు విరాట్ కోహ్లీ ఇచ్చిన ఉంగరం ధరకు సంబంధించిన వార్తలు ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఇటలీలో హెరిటేజ్ హోటల్ అద్దె ఖర్చు
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వివాహం 2017 డిసెంబర్ 11వ తేదీన ఇటలీలోని టస్కనీలోని బోర్గో ఫినోచియాట్ అనే హెరిటేజ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఆ హోటల్‌కు ప్రతీ రోజు సుమారు రూ.13.5 లక్షలు చెల్లించినట్టు సమాచారం. మొత్తంగా ఈ హోటల్ అద్దె ఖర్చు రూ.95 లక్షలుగా నిర్ధారిస్తున్నారు.

విరుష్కకు డైమండ్ రింగ్ గిఫ్టుగా
అయితే పెళ్లికి ముందు అనుష్కకు అరుదైన ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వాలని విరాట్ కోహ్లీ డిసైడ్ అయ్యారట. అందుకోసం మూడు నెలల ముందే ప్రయత్నాలను ప్రారంభించారు. చివరకు ఆస్ట్రియాలోని ప్రముఖ జ్యువెల్లరీ డిజైనర్‌తో వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని చేయించి ఇచ్చారు. ఆ ఉంగరం ఖరీదు సుమారు కోటి రూపాయలు అనే విషయం వెలుగులోకి వచ్చింది.

విరుష్క దంపతులకు తొలి సంతానం
ఇదిలా ఉండగా, విరాట్, అనుష్క దంపతులకు తొలి సంతానం రెండు నెలల క్రితం కలిగింది. తమ మొదటి సంతానానికి వమికా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన కూతురు వమికా రెండో నెల బర్త్ డేను ఘనంగా విరుష్క దంపతులు జరుపుకొన్నారు.
పూజా హెగ్డే హాట్ అండ్ సెక్సీ ఫోటో గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

అనుష్క శర్మ కెరీర్ ఇలా
అనుష్క శర్మ ఇటీవల కాలంలో పరీ, సంజూ, సూయి దాగా, జీరో చిత్రాల్లో నటించింది. 2020లో అంగ్రేజ్ మీడియం చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్‌తో అలరించింది. లాక్ డౌన్ సమయంలో నిర్మాతగా మారి పాతాల్ లోక్, బుల్‌బుల్ లాంటి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత అనుష్క ఇంకా కొత్త చిత్రాలను అంగీకరించిన దాఖలాలు లేవు.


Click it and Unblock the Notifications











