Father's Day: విరాట్ కోహ్లీకి వమికా ఫాదర్స్ డే గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా? అనుష్క శర్మ పోస్ట్ వైరల్
జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ స్పెషల్ డే రోజున తమ తండ్రులపై ప్రేమను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలంతా ఫాదర్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అనుష్క శర్మ ఫాదర్స్ డే సందర్భంగా విరాట్ కోహ్లీకి ఆయన కొడుకు, కూతురు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు అనే విషయాన్ని బయట పెట్టింది. మరి ఆ గిఫ్ట్ ఏంటో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
ఇటు సినిమా ప్రపంచంతో పాటు అటు క్రికెట్ తో సంబంధం ఉన్న సెలబ్రిటీ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది అనుష్క శర్మ. ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి విరాట్ ను అంగరంగ వైభవంగా పెళ్లాడింది. అయితే సినిమాలను మాత్రం వదులుకోకుండా నిర్మాతగా మారింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా బిజీ అయ్యింది.

అనుష్క శర్మ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె రీఎంట్రీ ఇస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శర్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానుల కోసం ప్రత్యేక ఫోటోలు వీడియోలను పంచుకుంటూ, ఫాలోవర్స్ కి అప్డేట్స్ ఇస్తుంది.
తాజాగా అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫాదర్స్ డే సందర్భంగా అనుష్క శర్మ ఈ స్పెషల్ పోస్ట్ చేయగా, దానిని చూసి విరాట్ కోహ్లీకి తన పిల్లల తరఫున అనుష్క శర్మ పెద్ద బహుమతినే ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. అనుష్క శర్మ ఒక అందమైన పెయింటింగ్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అందులో తమ కూతురు వామిక, కొడుకు అకాయ్ ల పాల ముద్రలు కనిపిస్తున్నాయి. పసుపు రంగులో ఉన్న ఆ పెయింటింగ్ ను పోస్ట్ చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే అని క్యాప్షన్ ఇచ్చింది అనుష్క శర్మ. ఇక ఈ పోస్ట్ కి ఒక వ్యక్తి ఇన్ని విషయాలలో ఇంత మంచిగా ఎలా ఉండగలడు? మేము నిన్ను ప్రేమిస్తున్నాము విరాట్ కోహ్లీ అంటూ రాస్కొచ్చింది.
దీంతో ఆ పోస్ట్ గంటల వ్యవధిలోనే వైరల్ గా మారింది. ప్రస్తుతం అనుష్క తన ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. ఇటీవలే అనుష్క, విరాట్ తమ రెండవ సంతానమైన అకాయ్ కి లండన్ లో స్వాగతం పలికారు. అయితే ఇంకా అకాయ్ ఫేస్ ను ఈ జంట రివీల్ చేయలేదు. గతంలోనూ వామిక కోహ్లీ ఫేస్ ను ఇలాగే దాచిపెట్టారు. కొన్నాళ్ళ తరువాత రివీల్ చేశారు.


Click it and Unblock the Notifications











