షార్ట్ డ్రెస్‌లో హాట్‌గా అనుష్క శర్మ: కోహ్లీ భార్య ఫోజులు చూశారంటే!

హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటారు. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. అదే సమయంలో తమ రేంజ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఒకరు. సినిమాల్లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఈ సుందరాంగి.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత స్పీడు తగ్గించింది.

ఆ తర్వాత తల్లి అవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అనుష్క కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

అలా ఎంట్రీ ఇచ్చి.. ఫుల్ ఫేమస్

అలా ఎంట్రీ ఇచ్చి.. ఫుల్ ఫేమస్


టాలెంటెడ్ బ్యూటీ అనుష్క శర్మ'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆమె.. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లు దక్కించుకుంది. అలా చాలా కాలం హిట్లను కొట్టేసి బాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది.

 కోహ్లీని ప్రేమ పెళ్లి చేసుకుందిగా

కోహ్లీని ప్రేమ పెళ్లి చేసుకుందిగా


ఎన్నో హిట్లతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట... కొన్ని సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంది.

 తల్లైన హీరోయిన్... కెరీర్‌కు గ్యాప్

తల్లైన హీరోయిన్... కెరీర్‌కు గ్యాప్


విరాట్‌తో వివాహం తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌‌ను మంచిగానే సాగించింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని నామకరణం చేశారు. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో నటించలేదు. కానీ, కొన్ని చిత్రాలను నిర్మించింది.

మళ్లీ మేకప్ వేసుకున్న అనుష్క

మళ్లీ మేకప్ వేసుకున్న అనుష్క


సుదీర్ఘ కాలం పాటు అనుష్క శర్మ నటిగా వెండితెరకు దూరంగా ఉన్నా.. సినీ రంగంతో మాత్రం సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. ఇక, ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రాక్టీస్ మమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే ఆమె పాల్గొంటోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ తీసుకున్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది.

హాట్ ఫొటోలనూ షేర్ చేస్తోంది

హాట్ ఫొటోలనూ షేర్ చేస్తోంది


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న అనుష్క శర్మ.. పెళ్లైన తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మరీ దారుణమైన హాట్ పిక్స్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్ భారీగా పెంచుకుంటోంది.

అనుష్క షార్ట్ డ్రెస్ పిక్స్ వైరల్

అనుష్క షార్ట్ డ్రెస్ పిక్స్ వైరల్


అనుష్క శర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షార్ట్ డ్రెస్ మాత్రమే ధరించి ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో అనుష్క షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X