కవ్వించిన అనుష్క శర్మ.. క్రేజీగా విరాట్ కోహ్లి రియాక్షన్
లాక్‌డౌన్ కారణంగా ప్రతీ ఒక్కరికి తమ కుటుంబంతో గడిపేందుకు కావాల్సినంత సమయం దొరుకుతున్నది. దేశం కోసం ఎప్పుడూ ఆటలు ఆడే క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు, సినిమా షూటింగులతో బిజీగా ఉండే సినీ తారలకు ఇది కలిసి వచ్చిన వచ్చిన అవకాశమే. ఇలా కరోనాకారణంగా ఇంటికే పరిమితమైన దీపికా, రణ్‌బీర్, ఆలియా, రణ్‌బీర్, మలైకా, అర్జున్ కపూర్ రొమాంటిక్‌గా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇదే జాబితాలో బాలీవుడ్ తార అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ చేరిపోయారు.
గత నెల రోజులుగా విరాట్, అనుష్కలిద్దరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. వారిద్దరి చిలిపి చేష్టలు అభిమానులకు పండగగా మారాయి. క్వారంటైన్ పిరియడ్‌లో వారి మధ్య జరుగుతున్న చిలిపి విషయాలను వీడియోలో రూపంలో, ఫోటోల రూపంలో షేర్ చేసుకొంటున్నారు. తాజాగా అనుష్క షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఏదో పనిలో నిమగ్నమైన విరాట్ కోహ్లీని అనుష్క శర్మ తనదైన స్టయిల్‌లో కవ్వించింది. కోహ్లి.. ఓయ్ కోహ్లీ.. చౌకా మారో.. చౌకా.. ఏం చేస్తున్నావు.. కోహ్లి.. ఓయ్ కోహ్లి (ఓయ్ కోహ్లీ.. ఏం చేస్తున్నావు.. ఫోర్ కొట్టు ఫోర్) అంటూ అనుష్క ఆటపట్టించింది. అనుష్క కవ్వింపులకు విరాట్ ఓ సీరియస్ లుక్ ఇవ్వడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్, టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్‌గా మారింది. ఇన్స్‌టాలో 24 గంటల్లో సుమారు 4 లక్షల మంది వీక్షించారు.
పెళ్లి తర్వాత అనుష్క శర్మ పెద్దగా నటించిన దాఖలాలు లేవు. సూయి దాగా, జీరో, అంగ్రేజీ మీడియం సినిమాల్లో మాత్రమే కనిపించింది. చేతిలో కొత్త ప్రాజెక్టులు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక ఐపీఎల్ టోర్ని రద్దు కావడంతో విరాట్ కోహ్లీ ప్రస్తుతం గృహ నిర్బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











