Pregnancy తల్లి కాబోతున్న అనుష్క.. ప్రెగెన్నీ గురించి లీక్ చేసిన టాప్ క్రికెటర్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇండియన్ టాప్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు మరోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. 2017 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకొన్న ఈ సెలబ్రిటీ జంట వమికా అనే అమ్మాయికి జన్మనిచ్చారు. అయితే అనుష్క శర్మ మరోసారి గర్బం దాల్చిన విషయం మీడియాలో, సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులు రెండో బిడ్డను కనబోతున్నారనే వార్త మీడియాలో హైలెట్‌గా మారింది. అయితే ఇటీవల ఆమె తన గర్బాన్ని కనిపించకుండా కవర్ చేసుకోవడాన్ని మీడియా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. దాంతో ఆమె రెండోసారి తల్లి కాబోతున్నాయనే ఊహాగానాలకు బలం చేకూరాయి.

Viraj Kohli expecting Second Baby

అయితే అనుష్క శర్మ రెండోసారి గర్భం దాల్చిందనే విషయాన్ని విరాట్ కోహ్లీ గానీ, ఆయన తరఫు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆ వార్త నిజమేనని అనుష్క, విరాట్ సన్నిహితులు అనధికారికంగా ధృవీకరించారు. త్వరలోనే వారిద్దరూ అధికారికంగా ప్రకటిస్తారు అని వారు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివీల్లియర్స్ అనుష్క శర్మ గర్బవతి అయిందనే విషయాన్ని తాజా ఇంటర్వూలో వెల్లడించారు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకోవడం తెలిసిందే. అనుష్క ప్రెగ్నెన్సీ కారణంగానే విరాట్ రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడనే విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం భార్య అనుష్క శర్మ బాగోగులు చూసుకొంటున్నారు. ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన ఇంగ్లాండ్ టూర్‌కు దూరంగా ఉన్నారు. త్వరలోనే ఆ కుటుంబంలో రెండో బిడ్డ అడుగుపెట్టబోతున్నది. మూడో టెస్ట్ నుంచి విరాట్ అందుబాటులో ఉంటాడు అని డీవీలియర్స్ తెలిపారు.

అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే.. భారత మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చక్దా ఎక్స్‌ప్రెస్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ప్రోసిక్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అన్షుల్ చౌహాన్, మనోజ్ ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X