Net Worth: విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ తర్వాత.. అనుష్క శర్మ నికర ఆస్తులు ఎన్ని కోట్టంటే?
ఇండియన్ డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిందని ఆయన తన ఇస్స్‌టాగ్రామ్‌లో పోస్టు ద్వారా ఎమోషనల్ అయ్యారు. ఎన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ.. క్రికెట్ నాకు ఓ ఎమోషన్ అని చెప్పారు. అయితే భర్త రిటైర్మెంట్‌పై అనుష్క శర్మ కూడా భావోద్వేగంతో స్పందించింది. విరాట్ కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క లైఫ్ ఊహకు అందని విధంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆమె నికర సంపద ఎంత అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఆమె ఆస్తుల వివరాల్లోకి వెళితే..
క్రికెటర్‌గా రాణిస్తున్న తొలి నాళ్లలో విరాట్ కోహ్లీకి, అలాగే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కకొంటున్న అనుష్క శర్మ పరిచయం ఆసక్తికరంగా జరిగింది. ఓ యాడ్ షూట్ సందర్భంగా జరిగిన పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం విస్తరించి ప్రేమగా మారింది. అలా చాలా ఏళ్లు వారిద్దరూ అఫైర్ కొనసాగిస్తూ డేటింగ్‌తో సరిపెట్టుకొన్నారు. వారి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో అనేక రకాలుగా కథకథలుగా వచ్చాయి.

అయితే తమ అఫైర్‌పై వచ్చిన రూమర్లకు తెరదించుతూ డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇటలీలో 2017 డిసెంబర్ 11 తేదీన వివాహం చేసుకొన్నారు. వారికి వమికా అనే కూతురు, అకాయ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే వివాహం తర్వాత కంప్లీట్‌గా అనుష్క దాంపత్య జీవితానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ నిర్మాతగా మారి సూయి దాగా లాంటి సినిమాలు, పాతాల్ లోక్, బుల్ బుల్ లాంటి వెబ్ సిరీస్‌లను నిర్మించారు.
అగ్రశ్రేణి హీరోయిన్‌గా అనుష్క శర్మ సంపాదనలో టాప్ స్థానంలో కొనసాగారు. షారుక్, రణ్ బీర్ లాంటి టాప్ హీరోలతో కలిసి నటించారు. ఈ క్రమంలో 2018లో ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో ఆమె చేరారు. సంవత్సరానికి ఆమె సుమారుగా 45 కోట్లు సంపాదిస్తున్నదని ఫోర్బ్స్ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఆసియాలో అత్యధికంగా సంపాదించే 30 మందిలో కూడా అనుష్క ఒకరిగా నిలిచారు.
తాజా ఆర్థిక సంస్థల అధ్యయనంలో వెల్లడైన గణాంకాల ప్రకారం.. అనుష్క శర్మ నికర ఆస్తుల విలువ సుమారుగా 250 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు. అయితే విరాట్, అనుష్క ఆస్తుల మొత్తం సుమారుగా 1300 కోట్ల రూపాయలు అని తేల్చారు. ఇండియాలో సంపన్న సెలబ్రిటీ కపుల్స్ జాబితాలో వీరిద్దరూ కూడా టాప్ స్థానంలో ఉన్నారు. ఇవియే కాకుండా ముంబై, ఢిల్లీలో విలాసవంతమైన విల్లాలు, ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే ఖరీదైన వాహనాలు వారి వద్ద ఉన్నాయి.
అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే.. 2022 సంవత్సరం నుంచి పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఆమె అతిథి పాత్రలో నటించిన చిత్రం కాలా. ప్రస్తుతం చక్దా ఎక్స్‌ప్రెస్ అనే బయోపిక్‌లో నటిస్తున్నారు. క్రికెటర్ జులన్ గోస్వామి పాత్రలో ఆమె కనిపించనున్నారు. 2023 సంవత్సరంలో ది రొమాంటిక్స్ అనే టెలివిజన్ సిరీస్‌లో భాగమయ్యారు.


Click it and Unblock the Notifications











