అనుష్క డ్రెస్ కావాలా..? ఫ్రిడ్జ్ కావాలా..?
బాలీవుడ్ అందాల భామ అనుష్క అందంతో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహమాడింది . ఇక ఈ జంట తరచు విహారయాత్రలకు వెళ్తూ తమ వైవాహిక జీవితాన్ని హాయి గా గడుపుతున్నారు . పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైన అనుష్క సోషల్ మీడియాలో మస్త్ యాక్టివ్‌గా ఉంటోంది.
ఇక ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పిన విరుష్కా జంట ఎప్పటికప్పుడు ఆ అప్ డెట్స్ ను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ సహా దుబాయ్ వెళ్ళింది. సమయం దొరికినప్పుడల్లా దుబాయ్ లోని అందమైన లొకేషన్స్ లో ఫోటోలు దిగుతూ షేర్ చేస్తోంది. ఇక అనుష్క ఎప్పుడూ కంఫర్ట్ స్టైలింగ్‌కి ప్రాధాన్యత ఇస్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

సన్ షైన్ ను ఆస్వాదిస్తూ ఫొటోకు ఫోజ్ ఇచ్చిన ఈ వైట్ బ్యూటీ పాకెట్ ఫుల్ సన్ షైన్ అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ ఫొటోలో ఈ క్యూటీ వేసుకున్న డ్రస్ అందరిని ఆకర్షిస్తుంది. చూడడానికి సింపుల్ గా ఉన్నా ఆ డ్రస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అమ్మడి డ్రస్ అక్షరాలా 17500 రూపాయిలట. ఈ మొత్తంతో ఓ చిన్న సైజు ఫ్రిడ్జ్ కొనుకోవచ్చు అంటూ మీమ్స్ మొదలయ్యాయి. ఏమైనా, ప్రస్తుతం ఈ ఫొటో మస్త్ వైరల్ గా మారిందని చెప్పాల్సిందే.


Click it and Unblock the Notifications











