Anushka Shetty : ప్రభాస్‌కు దూరంగా.. బాహుబలికి ముఖం చాటేస్తున్న అనుష్కశెట్టి
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను సైన్ చేస్తోంది. నెక్స్ట్ అనుష్క శెట్టి ఘాటి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అనుష్క శెట్టి నటించిన బాహుబలి చిత్రం ప్రస్తుతం రీ రిలీజ్ కాబోతోంది. సందర్భంగా టీమ్ అంతా రీ యూనియన్ అయింది. కానీ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా మాత్రం హాజరు కాలేదు. దీంతో ప్రభాస్, అనుష్క శెట్టి మధ్య దూరం పెరిగిందంటూ చర్చ కొనసాగుతోంది. అందుకు కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ కు ఎంతో దగ్గరగా..
సూపర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రభాస్ తో నటించిన చిత్రాలు మాత్రం ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండి పోయాయి. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 వంటి చిత్రాల్లో నటించారు. ఇక ప్రభాస్ తోనే అనుష్క శెట్టి ఎక్కువ సార్లు కలిసి నటించడం విశేషం. దీంతో అనుష్క శెట్టికి ప్రభాస్ కు మధ్య మంచి బాండ్ ఏర్పడింది. పలు ఇంటర్వ్యూల్లోనూ తమ ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇక సోషల్ మీడియాలోనూ ఒకరి సినిమాను మరొకరు సపోర్ట్ చేసుకుంటూ కనిపించారు.

ప్రభాస్ అనుష్క మధ్య రిలేషన్ షిప్?
బిల్లా చిత్రం నుంచి ప్రభాస్, అనుష్క శెట్టి పెయిర్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలకు మంచి ఫలితాలూ అందాయి. మరోవైపు 4 చిత్రాల్లో కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే వచ్చారు ప్రభాస్, అనుష్క. తాము ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. కానీ వీరిద్దరూ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ఒక్కటైతే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రభాస్ కు దూరంగా స్విటీ..
రీసెంట్ గా ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి నటించిన బాహుబలి చిత్రం రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కు బహుబలి టీమ్ మొత్తం హాజరైంది. కానీ అనుష్క శెట్టి మాత్రం హాజరు కాలేదు. దీంతో ప్రభాస్ పై కోపంతోనే అనుష్క శెట్టి ఈవెంట్ కు రాలేదని అంటున్నారు. ప్రభాస్ ను స్విటీ దూరంగా ఉంటోందని అంటున్నారు. మరోవైపు పబ్లిక్ లోకి రావడానికి అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తను ప్రైవసీ కోరుకుంటోందని అంటున్నారు. రాబోయే చిత్రం ఘాటీతో పబ్లిక్ ముందుకు వస్తుందని, ఆ తర్వాత తను ఇన్నాళ్లు కనిపించకపోవడానికి కారణం కూడా వివరించనుందని అంటున్నారు.
నెక్ట్స్ చిత్రాలు..
బాహుబలి చిత్రం తర్వాత నుంచి అనుష్క శెట్టి పెద్దగా సినిమాలు చేయడం లేదు. తనకు వద్దకు వచ్చిన చిత్రాల్లో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు మాత్రమే ఓకే చెబుతోంది. నెక్ట్స్ ఘాటీ చిత్రంతో అలరించబోతోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. జూలై 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం మళ్లీ వాయిదా పడింది. మరోవైపు ఖతనార్ అనే మలయాళం చిత్రంలోనూ అనుష్క శెట్టి నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











