Anushka Shetty: బర్త్ డే రోజున అనుష్క శెట్టి పోస్ట్ ట్రెండింగ్.. షాక్‌లో ఫ్యాన్స్!
ప్రతీ సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది హీరోలు హీరోయిన్స్ కూడా ఉంటారు కానీ అలా వచ్చి వెళ్లిపోయే వాళ్ళు కంటే కేవలం కొంతమంది మాత్రమే దశాబ్దాలు గడిచినా కూడా అదే స్టార్డంతో కొనసాగుతారు. కాగా ఇలా మన తెలుగు సినిమాలో కూడా ఉన్న టాప్ మోస్ట్ హీరోలు చాలా మందే ఉంటారు కానీ వారికి ధీటుగా నిలిచే హీరోయిన్స్ చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తారు.
కాగా అలా చాలా అరుదుగా కనిపించే స్టార్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది అనుష్క శెట్టి అనే చెప్పాలి. దాదాపు 20 ఏళ్ళు కితమే తెలుగు సినిమాలో ఎంటర్ అయ్యిన అనుష్క శెట్టి ఇప్పుడు ఎలాంటి క్రేజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. మన స్టార్ హీరోలు 40 కోట్లు కొడితే ఇండస్ట్రీ హిట్స్ అయ్యే రోజుల్లో సోలోగా తన సినిమాతో అనుష్క ఆ రేంజ్ సంచలనం సెట్ చేసింది.

అందుకే తెలుగు సినిమాలో కానీ తెలుగు ఆడియెన్స్ లో కానీ అనుష్క శెట్టికి ఒక సెపరేట్ మార్క్ మరియు మార్కెట్ రెండూ ఉన్నాయి. కాగా ఇతర హీరోయిన్స్ లా కాకుండా అనుష్క సోషల్ మీడియాలో చాలా అంటే చాలా తక్కువే యాక్టీవ్ గా కనిపిస్తుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమా పోస్టర్ లు పలు స్టిల్స్ అలాగే కొన్ని సినిమా అప్డేట్స్ ని ఆమె ఇస్తూ ఉంటుంది.
కాగా ఇపుడు అనుష్క తన ఇన్స్టాగ్రామ్ లో సడెన్ గా తనది ఓ పిక్ షేర్ చేసింది. దీనితో చాలా రేర్ గా పోస్ట్ చేసే అనుష్క నుంచి ఈ స్వీట్ సర్ప్రైజ్ చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయ్యిపోయారు. మరి ఇందులో స్వీటీ ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ ఇదే పిక్ చూసి ఫ్యాన్స్ కొంచెం వర్రీ కూడా అవుతున్నారు. కాగా సోషల్ మీడియాలో పలు మీమ్స్ చూస్తూనే ఉంటారు. మన చిన్ననాటి హీరోలు కొందరు ఫెవరెట్ వ్యక్తులు ఏజ్ అవ్వడం కొంచెం బాధిస్తుంది.
మరి ఇదే అనుష్కలో కూడా కనిపిస్తుంది. ఇన్నాళ్లు ఎంతో గ్లామర్ గా కనిపించిన అనుష్కకి తెల్ల వెంట్రుకలు కనిపించాయి. ఆ పిక్ లో సరిగా చూస్తే ఎవరికి అయినా ఇది కనిపిస్తుంది. దీనితో ఈ విషయంలో తమ ఫెవరెట్ హీరోయిన్ కూడా ఏజ్ అయిపోతుంది అంటూ కొందరు ఎమోషనల్ అవుతున్నారు. కాగా ఇలా తన పోస్ట్ అండ్ పిక్ ఇపుడు వైరల్ గా మారాయి.
ఇక ఇది పక్కన పెడితే అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి భారీ హిట్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొనే ఒక మాస్ చిత్రం "ఘాటీ"తో ఇపుడు రాబోతుంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా ప్రభాస్ ఫ్రెండ్స్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. కాగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏప్రిల్ 18న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











