నువ్వు లేకుంటే నేను లేను, పక్కనుంటే ఏదైనా సాధిస్తా: అనుష్క
సౌతిండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన తల్లి ప్రఫుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టు ద్వారా అమ్మపై తన ప్రేమను చాటుకునే ప్రయత్నం చేసింది ఈ లేడీ సూపర్ స్టార్.
'నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కనుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్‌డే అమ్మా..' అని పేర్కొంటూ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

అనుష్కకు సంబంధించిన వార్తలతో ప్రఫుల్లా శెట్టి తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తన కూతురుకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటూ ఆమె గతంలో పలు ఆలయాల్లో పూజలు చేస్తూ మీడియా కంటపడ్డ సంగతి తెలిసిందే.
ఇటీవల ప్రభాస్-అనుష్క పెళ్లి గురించి రూమర్లపై కూడా ప్రఫుల్లా స్పందించారు. ప్రభాస్ లాంటి మిస్టర్ పర్‌ఫెక్ట్ అనుష్కకు భర్తగా దొరకాలని తనకూ ఉందని, అయితే ప్రభాస్-అనుష్క స్నేహితులు మాత్రమే, వారికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











