టాప్ లేపేసిన అనుష్క: సినిమాలు చేయకున్నా ఏమాత్రం తగ్గలేదుగా.. షాక్‌లో సినీ పెద్దలు.!

By Manoj

తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరును సంపాదించుకున్న హీరోయిన్లలో కన్నడ పిల్ల అనుష్క శెట్టి పేరును ప్రప్రథమంగా చెప్పుకుంటారు. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు.. మొదట గ్లామరస్ పాత్రలకే పరిమితం అయింది. ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలోనే మంచి పేరును సంపాదించడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

ఆ నలుగురితో పాటు వాళ్లతో కూడా..

ఆ నలుగురితో పాటు వాళ్లతో కూడా..


‘సూపర్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తర్వాత ఆమె బిగ్ ఫోర్‌గా చెప్పుకునే చిరంజీవి (స్టాలిన్‌లో స్పెషల్ సాంగ్), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో ఆడిపాడింది. వీళ్లతో పాటు తర్వాతి తరం హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌తో పాటు రెమ్యూనరేషన్ కూడా అందుకుని సత్తా చాటింది.

ఒక్క సినిమాతో మలుపు తిరిగింది

ఒక్క సినిమాతో మలుపు తిరిగింది

అనుష్క.. తన కెరీర్ ఆరంభంలో గ్లామరస్ రోల్స్‌ మాత్రమే చేసింది. అవన్నీ ఆమెకు ఆఫర్లనైతే తెచ్చి పెట్టాయి కానీ, పేరును మాత్రం ‘అరుంధతి' అనే సినిమాతోనే దక్కించుకుంది. సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో అనుష్క నట విశ్వరూపం చూపించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది.

బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు

బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన క్రమంలోనే అనుష్క.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు కూడా దేశ వ్యాప్తంగా గుర్తింపును తీసుకు వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో అనుష్క... రాణిగా కనిపించిన తీరు ఆకట్టుకుంది.

ఆ దెబ్బకు సినిమాలకే దూరమైంది

ఆ దెబ్బకు సినిమాలకే దూరమైంది

అప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన అనుష్క.. ‘సైజ్ జీరో' అనే ప్రాజెక్టు చేసిన తర్వాత మాత్రం బొత్తిగా కనిపించనే లేదు. దీనికి కారణం ఈ మూవీ కోసం ఆమె భారీగా బరువు పెరిగిపోవడమే. సినిమా కోసం చేసిన ప్రయోగం వికటించడంతో ఆమె చాలా అవకాశాలు కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికీ ఆమె బరువుతో బాధ పడుతూనే ఉంది.

సైలెంట్‌గా పని చేసిన అనుష్క

సైలెంట్‌గా పని చేసిన అనుష్క

ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ అంజలి కీలక పాత్ర చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క పాత్ర కొత్తగా ఉంటుందని అంటున్నారు.

టాప్ లేపేసిన అనుష్క.. షాక్‌లో సినీ పెద్దలు

టాప్ లేపేసిన అనుష్క.. షాక్‌లో సినీ పెద్దలు


తాజాగా అనుష్క గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... నిశ్శబ్దం మూవీ కోసం అనుష్క రూ. 2.50 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటోందట. ఇప్పటి వరకు ఇంత మొత్తం అందుకున్న హీరోయిన్ తెలుగులో లేదని అంటున్నారు. సినిమాలు లేకున్నా అనుష్క ఇంత మొత్తంలో చార్జ్ చేయడం సినీ పెద్దలనే విస్మయానికి గురి చేస్తోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X