అనుష్క శెట్టి చిన్ననాటి ఫొటో వైరల్.. ఆ వయసులోనే స్మైల్ తో చంపేసింది!
టాలీవుడ్ స్వీటీ అనుష్క క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకోవడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ను సెట్ చేసుకుంది. ఇక స్వీటీ ఎంత కూల్ గా కనిపిస్తుందో అందరికి తెలిసిందే. అయితే వెండితెరపై కనిపిస్తే మాత్రం ఆమె పాత్రతో డిఫరెంట్ లుక్స్ తో షాక్ ఇస్తుంది. అప్పుడప్పుడు అనుష్కకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో కూడా తెగ వైరల్ అవుతోంది.

డిఫరెంట్ పాత్రలు..
సూపర్ సినిమా నుంచి మొదలుకొని మొన్న వచ్చిన సైరా వరకు ఆమె చేసిన ప్రతి పాత్ర కోసం ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఆ పాత్రలన్నీటి కంటే మరింత వినూత్నంగా నెక్స్ట్ సినిమాలో కనిపించాలని అనుష్క సరికొత్తగా రెడీ అవుతుంటుంది. అనుష్క శెట్టి వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. బాహుబలి తరువాత మెయిన్ లీడ్ లో ఆమె కేవలం రెండే సినిమాలు చేసింది.

ఆఫర్స్ బాగానే వస్తున్నాయి
ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. కానీ అమ్మడు కేవలం తనకు సెట్టయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది. భాగమతి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక భాగమతి సినిమా తరువాత అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో రూపొందిన సైలెన్స్ సినిమాలో అనుష్క ఒక మూగమ్మాయిలా నటించింది.

ఓటీటీ డిజాస్టర్
అయితే నిశ్శబ్దం సినిమాలో అమ్మడి పాత్రకు గుర్తింపు బాగానే వవచ్చినప్పటికీ సినిమా ఓటీటీలో విడుదలై దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఆడియెన్స్ కు ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదు. ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం ఆడియెన్స్ కు మంచి కిక్కివ్వాలని అనుష్క తన స్టైల్ ను పూర్తిగా మార్చనున్నట్లు సమాచారం.

చిన్నప్పటి ఫొటో వైరల్
ఇక అనుష్క చిన్నప్పటి ఫొటో విషయానికి వస్తే ఏడాది వయసులో ఉన్నప్పుడు తన అన్నలతో కలిసి ఇలా క్యూట్ గా స్టిల్ ఇచ్చింది. అరుంధతిగా వెండితెరపై ఉగ్రరూపం చూపించిన అనుష్క చిన్నప్పటి ఫొటో ఎంత క్యూట్ గా ఉందొ అని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

16ఏళ్ళ పడుచు పిల్లలా..
ఇక మొన్నటివరకు కాస్త బొద్దుగా ఉన్న అనుష్క ఇప్పుడు ఫీట్నెస్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్. బొద్దుగా కాకుండా నాజూగ్గా 16ఏళ్ళ పడుచు పిల్లల దర్శనమివ్వనుందట. సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరు కనిపించని పాత్రలో నటించనున్నట్లు టాక్. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్న అనుష్క ఆ కథపై చాలా నమ్మకంతో ఉందట.

మరోసారి బిగ్ బడ్జెట్
కొత్త సినిమా కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టినట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ లోనే ఆ సినిమా రూపొందనుంది. ఆ ప్రొడక్షన్ లో అనుష్క బాగమతితో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్కకు ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదట. ముందుగా ఈ సినిమా పాత్రకు సరైన న్యాయం చేయాలని అందుకే వేరే సినిమాలను ఓకే చేయడం లేదట. త్వరలోనే సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











