ప్రభాస్ విషయంలో అనుష్క ఆతృత.. ఆశ్చర్యం కలిగించేలా
బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్‌గా ఎదిగారు ప్రభాస్. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో ఆయన తదుపరి సినిమా విషయమై చాలా ఎగ్జైట్ గా ఉన్నారు ప్రేక్షకులు. అయితే చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ చివరకు సాహూ రూపంలో సెట్స్ పైకి వచ్చేశారు. దీంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొల్పింది.
భారీ అంచనాల నడుమ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా 400 కోట్ల బడ్జెట్‌తో సాహూ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది. చిత్రంలో ఒళ్లు గగ్గుర్లు పొడిచే యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ సుజీత్. ఈ సీన్స్‌లో ప్రభాస్‌తో పాటు శ్రద్దా కపూర్ కూడా కనిపించనుండటం విశేషం. ఇందుకు సంబంధించి అబుదాబిలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. ఇక ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహూ వీడియోస్ ఈ సినిమా రేంజ్‌ని తెలియజేయగా తాజాగా సాహూ అఫీషియల్ లుక్ అని పేర్కొంటూ ప్రభాస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ లుక్‌పై హీరోయిన్ అనుష్క స్పందించింది. సాహూ చిత్రాన్ని చూసేందుకు తాను చాలా ఆతృతగా ఉన్నట్లు ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది. తన అంచనా ప్రకారం చిత్రంలోని సన్నివేశాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయని ఆమె తెలిపింది. ప్రతి సన్నివేశం తర్వాత వచ్చే సీన్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తారని ఆమె పేర్కొంది. ఈ సన్నివేశాలను రక్తికట్టించేందుకు సినిమాను హై క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా సాహూ కోసం పని చేస్తున్న ప్రతి టెక్నీషయన్‌కు అభినందనలు చెప్పింది అనుష్క.

అనుష్క, ప్రభాస్ జోడీ అంటేనే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్. ఇద్దరూ బ్యాచిలర్స్ కావడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో
ప్రభాస్ సాహూ లుక్‌పై అనుష్క స్పందించడం ఇండస్ట్రీ వర్గాలను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న సాహూ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











