twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో టీజ‌ర్‌పై మ‌నుసు పారేసుకొన్న అనుష్క‌.. ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేకంగా

    |

    Recommended Video

    Anushka Shetty is all praises Prabhas Starrer Of Sahoo Teaser || Filmibeat Telugu

    ప్రభాస్ తాజా చిత్రం సాహో టీజర్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నది. సోషల్, వెబ్ మీడియాలో రికార్డులను తిరగరాస్తూ అత్యధిక వ్యూస్, లైక్స్ సాధిస్తున్నది. టీజర్ అద్భుతంగా ఉందని ఎస్ఎస్ రాజమౌళి నుంచి కరణ్ జోహర్ వరకు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ప్ర‌భాసకు సన్నిహితురాలైన అనుష్క సాహో టీజ‌ర్ పై స్పందించారు. సాహో టీజ‌ర్ గురించి ఆమె చెప్పిన విష‌యాలు ఏమిటంటే..

    యూట్యూబ్‌లో టీజ‌ర్‌ హ‌ల్‌చ‌ల్‌

    యూట్యూబ్‌లో టీజ‌ర్‌ హ‌ల్‌చ‌ల్‌

    సాహో టీజ‌ర్ యూట్యూబ్‌లో అనూహ్య‌మైన రెస్సాన్స్‌ను మూట‌గ‌ట్టుకొంటున్న‌ది. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ 20,424,869 వ్యూస్ సాధించింది. దాదాపు 5.3 లక‌ల వ్యూస్ సాధించింది. అంతేకాకుండా 33 వేల డిస్ లైక్స్ కూడా వచ్చాయి. ప్ర‌తీ రోజు టీజ‌ర్ సంఖ్య‌ను పెంచుకొంటూ పోతున్న‌ది. తాజాగా టీజ‌ర్‌ను చూసి మోజు ప‌డిన అనుష్క ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

    షాక్: నాగ శౌర్యకు ప్రమాదం.. కాలు ఫ్యాక్చర్ షాక్: నాగ శౌర్యకు ప్రమాదం.. కాలు ఫ్యాక్చర్

    అనుష్క శెట్టి కామెంట్స్‌

    అనుష్క శెట్టి కామెంట్స్‌

    సాహో పూర్తిగా అంటే పూర్తిగా న‌చ్చింది. టీజ‌ర్‌ను అద్భుతంగా రూపొందించిన యూనిట్‌కు కంగ్రాట్స్‌. యూవి క్రియేషన్స్‌, ప్ర‌భాస్‌, సుజిత్ కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు. సాహో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను అని అనుష్క త‌న ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో స్పందించారు.

    అనుష్క స్థానంలో శ్ర‌ద్దా క‌పూర్‌

    అనుష్క స్థానంలో శ్ర‌ద్దా క‌పూర్‌

    సాహో సినిమా ప్రారంభ‌మైన‌ప్పుడు వాస్త‌వానికి అనుష్క‌ను హీరోయిన్‌గా అనుకొన్నార‌ట‌. కానీ లావుగా ఉండ‌టం మూల‌నా ఆమెను ఈ సినిమా నుంచి త‌ప్పించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాకుండా ఈ సినిమాకు ముందు అనుష్క‌, ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్రచారం కూడా జ‌రిగింది. అయితే మా మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం ఫ్రెండ్ షిప్ మాత్ర‌మే అని వారు వివ‌ర‌ణ ఇచ్చారు.

    ఆగ‌స్టు 15న విడుద‌ల‌

    ఆగ‌స్టు 15న విడుద‌ల‌

    ప్ర‌భాస్‌, శ్ర‌ద్దాక‌పూర్ న‌టించిన సాహో చిత్రాన్ని సుజిత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా రిలీజైన సాహో టీజ‌ర్ రికార్డుల మోత మోగిస్తున్న‌ది. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, విజువ‌ల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంద‌నే మాట బ‌లంగా వినిపిస్తున్న‌ది. నీల్ నితిన్ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, ఎవ్లీన్ శ‌ర్మ‌, మందిరా బేడీ, అరుణ్ విజ‌య్ త‌దితరులు న‌టిస్తున్నారు. తెలుగు, తమిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

    English summary
    The teaser of Saaho has left fans of Prabhas mesmerises and the hangover of it is breaking the internet. SS Rajamouli to Karan Johar, many celebrities have heaped praises on the teaser of Saaho which indeed is mind-blowing. The latest to join is Prabhas' Baahubali co-star Anushka Shetty who too couldn't stop from praising the teaser. "Sahooooo totally totally loved the teaser ..congratulations to the entire team cast ? and crew?? .. uv creations , Prabhas , Sujeeth .. so so looking forward[sic]," wrote Anushka in her Instagram post along with a poster of Saaho.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X