నిర్మాతకు అనుష్క శెట్టి కండీషన్.. అక్కడికి పిలవొద్దని ముందే షరతు
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనుష్క శెట్టి బాహుబలి చిత్రం తర్వాత నుంచి పెద్దగా మీడియాకు అస్సలు కనిపించడం లేదు. సినిమా ఫంక్షన్లకు కూడా చాలా దూరంగా ఉంటోంది. తన రాబోయే సినిమాల విషయంలోనూ స్పందించడం లేదు. త్వరలో క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే పనిలో టీమ్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క శెట్టి గురించి ఓ వార్త సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి చిత్రం బాహుబలిలో నటించిన తర్వాత అనుష్క శెట్టికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అయితే ఆ క్రేజ్ తో అనుష్క శెట్టి నుంచి భారీ చిత్రాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా అనుష్క శెట్టి పూర్తిగా సినిమాలకే దూరమైంది. ఏదో ఒకటి రెండు అరకొర సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా కూడా అనుష్క శెట్టి తన సినిమాలకు కొన్ని కీలకమైన కండీషన్స్ ను పెడుతూ రావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గ్గా మారింది.

ఇక అనుష్క శెట్టి రాబోయే చిత్రం ఘాటి విషయంలోనూ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు ఒక కండీషన్ పెట్టిందంట. సినిమాలో నటించడం వరకే తన పాత్ర ఉంటుందని, ఆ తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనడం తనతో కాదని చెప్పిందంట. ఆ కండీషన్ కు ఒప్పుకున్నాకనే అనుష్క శెట్టి సినిమా చేసేందుకు సిద్ధమైందంట. అందుకే ప్రస్తుతం ఘాటి చిత్రం ప్రమోషన్స్ లో ఎక్కడ కనిపించడం లేదంటూ చర్చ జరుగుతోంది.
అసలు అనుష్క శెట్టి ఎందుకు ఘాటి సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోందనేది చర్చగా మారింది. మరోవైపు బాహుబలి ది ఎపిక్ చిత్రం ప్రమోషన్స్ లోనూ కనిపించలేదు. త్వరలో ప్రభాస్ తో అనుష్క శెట్టి స్పెషల్ చిట్ చాట్ లో కనిపిస్తారని మాత్రం అంటున్నారు. ఇక దానిపైనా కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఇక మున్ముందు అనుష్క శెట్టి తన రాబోయే చిత్రం ఘాటి విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి. ఫ్యాన్స్ మాత్రం అనుష్క శెట్టిని ప్రచార కార్యక్రమాల్లో చూడాలని ఉవ్వూల్లిరూతున్నారు. ఈ క్రమంలో మున్ముందు ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
మరోవైపు క్రైమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఘాటి చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించడం విశేషం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు ఎదుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి రూపొందించారు. అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించారు. నాగవెల్లి విద్యా సాగర్ సంగీత దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











