లీకైన అనుష్క ఫొటోలు.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు.. స్వీటీని చూస్తే భయపడతారు.!

అనుష్క శెట్టి.. తెలుగు వాళ్లకు పరిచయం అవసరం లేని పేరిది. అంతగా ఆమె ప్రభావం చూపించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిందీ కన్నడ బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, ఓ ప్రయోగాత్మక సినిమా చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇంతకీ ఏంటా ఫొటోలు..?

నాగార్జునే పరిచయం చేశాడు

నాగార్జునే పరిచయం చేశాడు

నాగార్జున - సోనూ సూద్ కలిసి నటించిన ‘సూపర్' అనే సినిమా ద్వారా అనుష్క శెట్టి సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ అనుష్కకు మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆమె దాదాపుగా టాలీవుడ్‌లోని అందరు హీరోలతో నటించింది. ఈ క్రమంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది

మలుపు తిప్పిన చిత్రం అదే

మలుపు తిప్పిన చిత్రం అదే

అరుంధతి.. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా. అనుష్క, సోనూ సూద్, అర్జన్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో అనుష్క నటను తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

అనుష్కను మార్చేసిన సినిమా ఇదే

అనుష్కను మార్చేసిన సినిమా ఇదే

అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో బిజీ బిజీగా గడపిన అనుష్క.. సైజ్ జీరో సినిమా తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 2015లో విడుదలైన ఈ సినిమాను కొవెలముడి ప్రకాష్ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందింది. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిచిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి ముఖ్య పాత్ర పోషించగా ఆర్య, ప్రకాష్ రాజ్ మరియు సోనాల్ చౌహాన్ సహయ పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం స్వీటీ బాగా బరువు పెరిగింది.

బాహుబలికి ఇబ్బందులే

బాహుబలికి ఇబ్బందులే

బాహుబలి పార్ట్ 1 తీసిన తర్వాత సైజ్ జీరో విడుదలైంది. దీంతో రెండో భాగం చేసే సమయంలో అనుష్క బరువు సినిమాకు ఇబ్బంది అయింది. అప్పట్లో ఆమెను గ్రాఫిక్స్‌లో సన్నగా చూపించారన్న టాక్ కూడా వినిపించింది. ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న స్వీటీ భాగమతి అనే సినిమా చేసింది. అందులో కొంచెం పర్వాలేదనిపించింది. అయితే, అప్పటి నుంచి ఆమె మరో సినిమాలో కనిపించలేదు.

 ఫొటోలు లీక్

ఫొటోలు లీక్

తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో పాల్గొన్న తర్వాత ఆమె మంగళవారం హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా స్వీటీ ఎయిర్ పోర్టులో దిగిన సమయంలో ఎవరో ఫొటో తీసి ఇంటర్నెట్‌లో పెట్టారు. ఇందులో ఆమె చాలా లావుగా కనిపిస్తోంది. అంతేకాదు, మేకప్ లేకుండా కనిపిస్తోంది. దీంతో అందరూ భయపడిపోతున్నారు.

నిశ్శబ్దంగా కానిచ్చేస్తుంది

నిశ్శబ్దంగా కానిచ్చేస్తుంది

చాలా రోజుల గ్యాప్ తర్వాత అనుష్క ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌తో రూపొందుతోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తోనే రూపొందుతున్న నిశ్శబ్దం విడుదల తేది గురించి ఇంకా సమాచారం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X