రూమర్లు చెలరేగుతున్నా.. ఇంకా అతన్నే ఫాలో అవుతున్న అనుష్క!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులోనే జరగాలని.. పెద్దలు చెబుతుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఈ కామెంట్స్ కి స్టార్స్ వాల్యూ ఇవ్వడం లేదు. పెళ్లి అంటే చిరాకు పడుతున్నారు. సినిమా ప్రపంచంలో గోల్స్ కోసం పర్సనల్ లైఫ్ ని చాలా మిస్ అవుతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. హీరోలే అనుకుంటే హీరోయిన్స్ వారి కంటే ఎక్కువగా సింగిల్ గానే ఉండడానికి ఇష్టపడుతున్నారు.

దేవసేన కూడా..

దేవసేన కూడా..

టాలీవుడ్ బ్యూటీ అనుష్కకి సంబంధించిన పెళ్లి రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు ప్రభాస్ తో ఆమె పెళ్లి జరగనున్నట్లు రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా గాసిప్స్ డోస్ తగ్గడం లేదు. బాహుబలి పూర్తయినప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూలలో ప్రభాస్ ఆ రూమర్స్ కి చెక్ పెడుతూనే ఉన్నాడు.

ముందు పెళ్లి కావాలి.

ముందు పెళ్లి కావాలి.

అనుష్క, ప్రభాస్ బిల్లా తరువాత డేటంగ్ స్టార్ట్ చేసి బాహుబలి సినిమాతో మరీంత దగ్గరయ్యారు అని నేషనల్ మీడియాలలో కూడా వార్తలు రావడం ఇద్దరి స్టార్స్ ని కాస్త తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. ఆ మధ్య కాలంలో ప్రభాస్ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. రూమర్స్ ఆగిపోవాలి అంటే.. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ముందు పెళ్లి కావాలని చెప్పాడు. ఆ దెబ్బతో ప్రభాస్ ఆలోచన విధానంపై అందరికి ఒక క్లారిటీ వచ్చింది.

 పెళ్లి వయసు దాటిపోయింది..

పెళ్లి వయసు దాటిపోయింది..

అనుష్క వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు. మరో రెండేళ్లయితే ఆఫ్ సెంచరికి దగ్గర్లో ఉంటుంది. ఈ వయసులో ఆమె పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదని అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. లేకపోతే అనుష్క ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుందట. పెళ్లి మ్యాటర్ లో ఆమె ప్రభాస్ ని ఫాలో అవుతోందట. ఇంకొన్ని మంచి సినిమాలు చేయాలని మరికొన్ని రోజులు పెళ్లిని వాయిదా వేసుకుంటోందని టాక్.

Recommended Video

Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors
నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు..

నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు..

అనుష్క మరో రెండేళ్ల వరకు పెళ్లి మ్యాటర్ తన వద్దకు తీసుకురావద్దని ఇంట్లో వాళ్లకు ముందే చెప్పిందట. ఇక వచ్చే ఏడాది అనుష్క పెళ్లి అవుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. 40లోకి వచ్చిన తరువాత స్వీటీ పెళ్లి జరిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X