For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తారక్ తర్వాత అనుష్క అలా కనిపిస్తుందట.. ప్రభాస్‌కు నచ్చిన విషయం కూడా అదే.!

  By Manoj Kumar P
  |

  అనుష్క శెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. అద్భుతమైన నటనకు తోడు అందంతో చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిందీమె. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ రోల్స్‌లో ఎక్కువగా కనిపించిన స్వీటీ.. ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుని సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం పచ్చ జెండా ఊపి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. గతంలో మాదిరిగా ఈ మధ్య క్రమంగా సినిమాలు చేయని అనుష్క గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

  టాలీవుడ్ బిగ్ ఫోర్‌తో ఆడిపాడింది

  టాలీవుడ్ బిగ్ ఫోర్‌తో ఆడిపాడింది

  అనుష్క.. ‘సూపర్' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె ఎంతో మంది సీనియర్ జూనియర్ హీరోల సరసన నటించింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో బిగ్ ఫోర్‌గా చెప్పుకునే వెంకటేష్‌, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జునలతో ఎన్నో మూవీల్లో ఆడిపాడింది. వీరిలో చిరుతో మాత్రం పూర్తి సినిమాలో నటించకపోయినా స్పెషల్ సాంగ్ చేసింది.

  ఆ సినిమా అనుష్కకు ప్రత్యేకం

  ఆ సినిమా అనుష్కకు ప్రత్యేకం

  అందంతో పాటు అభినయంలోనూ సత్తా చాటింది అనుష్క. అందుకే ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయడానికి చాలా మంది ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘అరుంధతి' అనే సినిమా చేసింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్లు రాబట్టింది. అలాగే, అనుష్కకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది.

  ఆయన మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు

  ఆయన మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు

  టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో అనుష్కకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో కూడా ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ముఖ్యంగా జక్కన్న.. అనుష్క కోసం డిజైన్ చేసిన పాత్ర మరో లెవెల్ అని చెప్పొచ్చు. ప్రభాస్ సరసన ఆమె ఎంతో హుందాగా నటించి మెప్పించింది.

  వికటించిన ప్రయోగం.. మొదలైన కష్టాలు

  వికటించిన ప్రయోగం.. మొదలైన కష్టాలు

  ‘బాహుబలి' పార్ట్ 1 విడుదలైన తర్వాత అనుష్క ‘సైజ్ జీరో' అనే సినిమాలో నటించింది. ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆమె బాగా బరువు పెరిగిపోయింది. తన కెరీర్‌ను పణంగా పెట్టినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అలాగే, ఆమె ఇప్పటి వరకు బరువు తగ్గలేకపోయింది. ఇది బాహుబలి 2 సమయంలోనూ జక్కన్నకు సవాల్‌గా మారింది.

  సైలెంట్‌గా పని కానిచ్చేస్తోంది

  సైలెంట్‌గా పని కానిచ్చేస్తోంది

  ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం' అనే సినిమా చేస్తోంది. సరికొత్త లైన్‌తో వస్తున్న ఈ మూవీని కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రయోగాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ అంజలి కీలక పాత్ర చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

  తారక్ తర్వాత అనుష్క అలా కనిపిస్తుందట

  తారక్ తర్వాత అనుష్క అలా కనిపిస్తుందట

  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అనుష్క ఫస్టాప్ మొత్తం మాట్లాడకుండా ఉంటుందట. 2005లో వచ్చిన ‘నరసింహుడు' సినిమాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ వరకు మాట్లాడడు. ఇప్పుడు అనుష్క అతడిని ఫాలో అవుతుందట. ఈ అంశం నచ్చే ప్రభాస్ చిత్ర ప్రమోషన్‌కు సాయం చేస్తానని ఒప్పుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.

  English summary
  Nishabdham is an upcoming Indian thriller film directed by Hemant Madhukar. The film starring Anushka Shetty as lead role alongside Madhavan, Anjali, Michael Madsen, Subbaraju, Shalini Pandey and Srinivas Avasarala in supporting roles. This film was simulataneously shot in Telugu and Tamil.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X