Anushka Shetty: పెళ్లిపై రానాకు అనుష్క శెట్టి క్లారిటీ.. ఈ ఏడాది చివరి నాటికి అంటూ స్వీటీ
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క శెట్టి..ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటితో మాట్లాడారు. ఈ సందర్బంగా పెళ్లి గురించి ప్రస్తావన రాగానే.. తన మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చారు.

బాహుబలి, వేదం సినిమాల్లో నా పాత్రలు నాకు చాలా ఇష్టం. వేదం సినిమాలో సరోజ పాత్ర నా కెరీర్‌లో బెస్ట్‌గా మిగిలింది. ఈ సినిమా తర్వాత హీరోయిజం ఉన్న పాత్రల కోసం హిట్ ఉమెన్ అయిపోతానేమో. బాహుబలి తర్వాత నన్ను ఇలాంటి పాత్రలు నేను తప్పా ఇంకెవరు చేయలేరు అంటున్నారు. నన్ను గుర్రం మీద, మహరాణిలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అని అనుష్క శెట్టి చెప్పారు.
ఘాటీ సినిమా ఒరిస్పా, ఆంధ్రా సరిహద్దులో జరిగే కథ. ఈ ప్రాంతాల్లో పండించే గంజాయి సాగు నేపథ్యంగ సాగుతుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులకు ఈ మూవీ కథ సరిగ్గా సరిపోతుంది. గంజాయి పండించే వారి జీవితాల చుట్టూ సన్నివేశాలు తిరుగుతుంటాయి. గంజాయి ప్రభావిత ప్రపంచంలో దేశరాజు, శీల జీవితాలు ఎలా ప్రభావితం చెందాయి. ఈ విషయాన్ని క్రిష్ చాలా చక్కగా చూపించారు అని రానా అడిగిన ప్రశ్నకు అనుష్క సమాధానం చెప్పారు.
గంజాయి వదిలేసి తమ దారిని బాధితులు తాము వెతుక్కొనే పాయింట్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమా కథను క్రిష్ అద్బుతంగా తెరకెక్కించారు. వేదం తర్వాత సరోజ పాత్ర అనంతరం శీలావతి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు క్రిష్‌కు కృతజ్ఞతలు. అలాంటి పాత్రలను క్రిష్ మాత్రమే సృష్టించగలరు. ఆయన చాలా లోతైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని అనుష్క చెప్పారు.
సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు ఎందుకు అని రానా అడిగితే.. ఈ సంవత్సరం ముగింపు నుంచి వచ్చే ఏడాదిలోగా ఎక్కువగా సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు తప్పుకుండా నా సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎక్కువ సినిమాలు చేయాలని అందరూ అడుగుతున్నారు. ఇంట్లో పెళ్లి, శుభకార్యం జరిగినా ఇదే అడుగుతున్నారు. అయితే పెళ్లి చేసుకొంటున్నావా? అని రానా ప్రశ్నిస్తే.. నా పెళ్లి కాదు.. ఇంట్లో పెళ్లి జరిగితే.. అందరూ ఎక్కువ సినిమాలు చేయాలని అడుగుతున్నారు. కాబట్టి ఎక్కువ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను.


Click it and Unblock the Notifications











