ట్విట్టర్‌లోకి అధికారికంగా అనుష్క శెట్టి.. ట్వీట్ చేసి అభిమానులతో
దక్షిణాదిలో అగ్రతార అనుష్క శెట్టి ట్విట్టర్‌లోకి అధికారికంగా ప్రవేశించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొద్దికాలంగా తన ట్విట్టర్ అకౌంట్ తెరిచే ఉద్దేశాన్ని వెల్లిడిస్తూ వస్తున్నది. అయితే తన అధికారిక అకౌంట్ ఇదే అంటూ అనుష్క ట్విట్ చేసింది.
అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రకటిస్తూ.... మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి @MsAnushkaShetty ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.

ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2వ తేదీన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు నటించారు.


Click it and Unblock the Notifications











