twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా రోజుల తరువాత దర్శనమిచ్చిన అనుష్క శెట్టి.. వారి తల్లిదండ్రులతో అలాంటి ఫొటో పోస్ట్ చేస్తూ..

    |

    ఒక్క హిట్టు వస్తే చాలు ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ నెంబర్ వన్ రేంజ్ తమదే అన్నట్లు ఫీల్ అవుతుంటారు. హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఎక్కువగా వైరల్ అయ్యేలా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం సినిమాల్లోనే వారి పాత్రకు తగ్గట్టుగా కనిపించి బయట ప్రపంచంలో మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తారు. అలాంటి అతికొద్ది మందిలో అనుష్క శెట్టి ఒకరు. అనుష్క చాలా రోజుల అనంతరం మళ్ళీ సోషల్ మీడియాలో విభిన్నంగా దర్శనమిచ్చింది. ఆ ఫొటోపై ఒక లుక్కేస్తే..

    హాట్ ఫొటోలతో కాకుండా..

    హాట్ ఫొటోలతో కాకుండా..

    చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా కూడా వారందరూ అనుష్క తర్వాతే అని చెప్పాలి. అందం నటన అలాగే మంచి మనసులో కూడా అనుష్క ను ఎవరు బీట్ చేయలేరు అనే చెప్పాలి. ఎంతో సౌమ్యంగా కనిపిస్తూ కేవలం సినిమాల వరకే గ్లామర్ను మెయింటైన్ చేస్తూ ఉండే ఆమె ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనుష్క శెట్టి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పెద్దగా పోస్ట్ చేయకపోయినా కూడా ఆమె ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.

     స్వీట్ హీరోయిన్

    స్వీట్ హీరోయిన్

    టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉంటారు అని నిరూపించిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లొ అనుష్క శెట్టి ఒకరు. అందంతో పాటు కథకు తగ్గట్టుగా సినిమాకు ఎంతవరకు అవసరమో అంతవరకు కష్టపడితే సరిపోతుంది అనే ఫార్ములా ఆమెకు చాలా బాగా తెలుసు. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు చోటు కి వెళ్ళకుండా క్రమశిక్షణతో ఇన్నేళ్లు స్వీట్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది.

    చివరగా ఆ సినిమాతో..

    చివరగా ఆ సినిమాతో..

    బాహుబలి సినిమా తో భారీ విజయాన్ని అందుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత గతంలో మాదిరిగా ఎక్కువ సినిమాలతో బిజీగా కనిపించలేదు. కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. వీలైనంత వరకు ఆమె రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కూడా చేయడానికి ఒప్పుకోవడం లేదు. చివరగా 2020లో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆ సినిమా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది.

    తల్లిదండ్రులతో కలిసి..

    తల్లిదండ్రులతో కలిసి..

    ఇక సినిమాలతో బిజీగా ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు అనుష్క శెట్టి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా తన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా ఆమె ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ ఫోటోలలో అనుష్క చాలా నాచురల్ గా కనిపిస్తోంది.

    అసలైన అందం అదే..

    అసలైన అందం అదే..

    అనుష్క శెట్టికి ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజుల్లో కేవలం ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉంటేనే చాలామంది బ్రాండ్ ప్రమోషన్స్ తో మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో ఇంతవరకు అనుష్క శెట్టి అలా ఎప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ చేయలేదు అలాగే బ్యూటీ యాడ్స్ ను కూడా ఆమె రిజెక్ట్ చేస్తోంది. నాచురల్ గా ఉంటేనే బాగుంటుంది అని అలాగే ప్రతి మనిషికి చిరునవ్వే అసలైన అందం అంటూ ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పింది.

     నవీన్ పొలిశెట్టితో సినిమా

    నవీన్ పొలిశెట్టితో సినిమా

    ఇక ప్రస్తుతం అనుష్క యువి క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తోంది. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ బాబు డైరెక్ట్ చేయబోయే ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో అనుష్క 35 ఏళ్లకు పైగా ఉండే మహిళగా కనిపిస్తుందట. ఇక తన కంటే పదేళ్లు చిన్నవాడైన ఒక హీరోను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తుందట. ఈ సినిమామాకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ను త్వరలోనే ప్రకటించారన్నారు.

    English summary
    Anushka shetty latest family photo viral in social media,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X