For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క బయట కనిపించనిది ఇందుకేనా.. దేవసేనపై హాట్ టాపిక్ అవుతోన్న రూమర్స్

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి అనుష్క శెట్టి. దాదాపు తెలుగులోని అందరు హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్‌ను సైతం అందుకుని రికార్డులు కూడా క్రియేట్ చేసింది. అదే సమయంలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపింది. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, తన గత చిత్రం 'భాగమతి' తర్వాత ఆమె బయట కనిపించడమే లేదు. దీంతో అనుష్క ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

   అక్కినేని హీరోనే తీసుకొచ్చాడు

  అక్కినేని హీరోనే తీసుకొచ్చాడు

  అనుష్కను అక్కినేని నాగార్జునే టాలీవుడ్‌కు పరిచయం చేశారన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్' సినిమా ద్వారానే అనుష్క శెట్టి సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాను టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ, అనుష్కకు మాత్రం మంచి పేరొచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

  జేజమ్మే మలుపు తిప్పింది

  జేజమ్మే మలుపు తిప్పింది

  అనుష్క వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ, ఆమెలోని నటను బయటకు తీసుకొచ్చిన సినిమా మాత్రం ‘అరుంధతి' అనే చెప్పాలి. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో నంది పురస్కారాలని అందుకుంది. దీని తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

   ఆ ప్రయోగమే కష్టాలను తెచ్చింది

  ఆ ప్రయోగమే కష్టాలను తెచ్చింది

  2015లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘సైజ్ జీర్'. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో ఆర్య, ప్రకాశ్ రాజ్, సోనాల్ చౌహాన్ నటించారు. రెండు భాషల్లో రూపొందిన ఈ సినిమా కోసం అనుష్క భారీ స్థాయిలో బరువు పెరిగిపోయింది. అప్పటి నుంచి వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

   రాజమౌళికి కూడా ఇబ్బందులే

  రాజమౌళికి కూడా ఇబ్బందులే

  అనుష్క అతిగా బరువు పెరగడం వల్ల దర్శకధీరుడు రాజమౌళికి కూడా ఇబ్బందులు తప్పలేదు. దీనికి కారణం బాహుబలి పార్ట్ 1 తీసిన తర్వాత సైజ్ జీరో విడుదలైంది. దీంతో రెండో భాగం చేసే సమయంలో అనుష్క బరువు సినిమాకు ఇబ్బంది అయింది. అప్పట్లో ఆమెను గ్రాఫిక్స్‌లో సన్నగా చూపించారన్న టాక్ కూడా వినిపించింది.

  చాలా కాలం తర్వాత నిశ్శబ్ధంగా..

  తన గత చిత్రం ‘భాగమతి' విడుదలైన చాలా కాలం తర్వాత అనుష్క మరో సినిమాలో నటిస్తోంది. ‘నిశ్శబ్దం' అనే పేరుతో వస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. అలాగే, కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌తో రూపొందుతోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

  అనుష్క అందుకే కనిపించడం లేదట

  అనుష్క అందుకే కనిపించడం లేదట

  తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. సీనియర్ నటి ఛార్మీ శనివారం అనుష్కతో దిగిన ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇందులో స్వీటీ లావుగానే కనిపిస్తోంది. దీంతో అనుష్క ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి బరువు తగ్గకపోవడమే కారణం అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇది హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  nushka Shetty is an Indian actress who appears in Telugu and Tamil films. She made her acting debut in Puri Jagannadh's 2005 Telugu film Super and appeared in Mahanandi, released later the same year. The following year, she had four releases, the first being S. S. Rajamouli's Vikramarkudu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X