twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదరగొడుతున్న అనుష్క కొత్త లుక్.. ఎంత స్లిమ్‌గా మారిందో తెలుసా!

    |

    Recommended Video

    Anushka Did A Photo Shoot For A Brand | Filmibeat Telugu

    అందాల తార అనుష్క వెండితెరపై మెరిసి ఏడాది గడిచిపోతోంది. బాహుబలి 2తో సంచలనం, భాగమతి సూపర్ హిట్ తర్వాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. ఇప్పుడిప్పుడే కెమెరా ముందుకు వస్తోంది. భాగమతి చిత్రంలో అనుష్క కాస్త బొద్దుగా మారిందనే కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు త్వరలో అనుష్క వివాహం అంటూ రూమర్స్ వ్యాపించాయి. ఆ విమర్శలని పట్టించుకోకుండా అనుష్క తన లుక్ పై దృష్టిపెట్టింది. విదేశాలకు వెళ్లి బరువు తగ్గి స్లిమ్ గా మారింది. తాజాగా అనుష్క ఓ ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది.

    ఆశ్చర్యపోతున్న అభిమానులు

    ఆశ్చర్యపోతున్న అభిమానులు

    తాజాగా ఫోటో షూట్ లో అనుష్క ఏంజెల్ లాగా మెరిసిపోతోంది. అనుష్క లేటెస్ట్ స్లిమ్ లుక్ చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె కెరీర్ ఆరంభ రోజులని తలపించేలా మారిపోయిందని అంటున్నారు. అనుష్క గత ఏడాది బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలన్నింటికీ పక్కన పెట్టి కొన్ని నెలలపాటు విదేశాల్లో బరువు తగ్గేందుకు కసరత్తులు చేసింది. అనుష్క పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు కనిపిస్తోంది.

     బీచ్‌లో మెరుపులు

    బీచ్‌లో మెరుపులు

    ఓ బ్రాండ్ కోసం అనుష్క బీచ్ లో ఫొటో షూట్ చేసింది. తెల్ల దుస్తుల్లో కళ్ళు చెదిరే అందంతో అనుష్క మెరిసిపోతోంది. ప్రస్తుతం అనుష్క కోనవెంకట్ సమర్పణలో ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతోంది. మరికొన్ని చిత్రాలకు కూడా సైన్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి పాత్రలోకి అద్భుతంగా నటించి మెప్పించే ప్రతిభ అనుష్క సొంతం. కోనవెంకట్ చిత్రంలో అనుష్క పాత్ర ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

    <strong>గెస్ట్ రోల్‌లో అనుష్క.. చిరంజీవి కోసమేనా!</strong>గెస్ట్ రోల్‌లో అనుష్క.. చిరంజీవి కోసమేనా!

     సస్పెన్స్ థ్రిల్లర్

    సస్పెన్స్ థ్రిల్లర్

    హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. కొందరు హాలీవుడ్ నటులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. ప్రముఖ నటుడు మాధవన్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కు సర్వం సిద్ధం అయింది. విదేశాల్లోనే కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగబోతోంది.

     అనేక రూమర్స్

    అనేక రూమర్స్

    భాగమతి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ ఏర్పడడంతో అనుష్క సినిమాలకు గుడ్ బై చెబుతోందని, పెళ్ళికి సిద్ధం అవుతోందంటూ అనేక రూమర్స్ వినిపించాయి. ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ కానుంది. గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా అనుష్క సత్తా చాటుతోంది. ఇలా రెండు విధాలుగా సత్తా చాటగల అతికొద్దిమంది సౌంత్ ఇండియన్ హీరోయిన్లలో అనుష్క ఒకరిని చెప్పొచ్చు.

    English summary
    Anushka Shetty latest photoshoot goes viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X