సీక్రెట్‌గా డాక్టర్‌ను కలిసిన అనుష్క శెట్టి... ఏం జరిగింది?

Recommended Video

Anushka Shetty Spotted Visiting Doctor, Why ? || Filmibeat Telugu

బాహుబలి తర్వాత ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి ఆ తర్వాత నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. అనుష్క నటించిన చివరి చిత్రం 'భాగమతి' విడుదలై సంవత్సరన్నర దాటిపోయింది. ఈ మూవీ తర్వాత బరువు తగ్గడంపైనే ఫోకస్ పెట్టిన ఆమె ఎక్కువ సమయం దానికే కేటాయించారు. ప్రస్తుతం అనుష్క... హేమంత్ మధుకర్ దర్శకత్వంలో 'సైలెన్స్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ యూఎస్ఏలో జరుగుతోంది.

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీలో అనుష్క అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆమెపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఈ షూటింగ్ జరిగే సమయంలో అనుష్క కాలికి గాయమైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

గుట్టు చప్పుడు కాకుండా డాక్టర్‌ను కలిసిన అనుష్క?

గుట్టు చప్పుడు కాకుండా డాక్టర్‌ను కలిసిన అనుష్క?

అయితే తనకు గాయమైన విషయం బయటకు పొక్కకుండా అనుష్క తగిన జాగ్రత్తలు తీసుకుందని, గుట్టు చప్పుడు కాకుండా డాక్టర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆమెకు కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం అని సూచించారట.

ఈ వార్తల్లో నిజం ఎంత?

ఈ వార్తల్లో నిజం ఎంత?

అయితే అనుష్కకు ‘సైరా' షూటింగులో గాయం అయిందనే వార్తలను ఆ చిత్ర బృందం కొట్టిపారేస్తోంది. అందులో నిజం లేదని అంటున్నారు. ఆమె షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, ఈ చిత్రానికి సంబంధించి పెండింగ్ షూటింగ్ ఏమీ లేదని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, చిరంజీవితో పాటు ఇతర తారాగణం డబ్బింగ్ చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

1857 కాలం నాటి కథతో

1857 కాలం నాటి కథతో

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్వాంతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. 1857 కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని రామ్ చరణ్ చరణ్ తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X