Nayantara Vs Anushka Shetty కుర్ర హీరోతో అనుష్క.. సూపర్‌స్టార్‌తో నయనతార.. బాక్సాఫీస్ సిగపట్లు?
అగ్ర హీరోలు, హీరోయిన్లు నటించిన సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం అరుదుగా జరుగుతుంటాయి. లాంగ్ వీకెండ్స్, దసరా, దీపావళీ లాంటి పండుగల సమయంలో హీరోలు, హీరోయిన్ల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కావడం, ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తిని రేపడం చూస్తుంటాం. ఈ ఏడాది నయనతార, అనుష్క శెట్టి నటించిన చిత్రాలు సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కానున్నాయి. దాంతో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఎవరు పైచేయి సాధిస్తారనే విషయం ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
బాహుబలి సినిమా తర్వాత అనుష్క శెట్టి పాపులారిటీ, కెరీర్ గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత చేసిన భాగమతి సూపర్ హిట్ కావడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. అలాగే ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాలో నటించింది. అప్పటి నుంచి తెలుగు సినిమాకు, సినిమా పరిశ్రమకు దూరమైంది.

అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేశ్ బాబు పీ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాల్లో ప్రస్తుతం అనుష్కశెట్టి నటిస్తున్నది. ఇటీవల విడుదలై ప్రచార వీడియోలు, పోస్టర్లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ సినిమా కొద్దికాలంగా రిలీజ్ కోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

అయితే అనుష్కశెట్టి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్ రోజునే లేడి సూపర్ స్టార్ నయనతార మూవీ జవాన్ కూడా రిలీజ్ కాబోతున్నది. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన ఈ సినిమా కూడా సెప్టెంబర్ 7వ తేదీనే రిలీజ్ కాబోతున్నది. దాంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారింది. దక్షిణాదిలో ఓ కొత్తరకంగా ఆరోగ్యకరమైన పోటీ ఈసారి హీరోయిన్ల మధ్య కనిపిస్తున్నది.

సెప్టెంబర్ 7వ తేదీన సీనియర్ హీరో షారుక్ ఖాన్‌తో నయనతార, కుర్ర హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇద్దరు అగ్ర హీరోయిన్ల సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఇద్దరు హిట్లు కొట్టి ప్రేక్షకులను ఆలరిస్తారా అనే విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











