యువ హీరోతో అనుష్క శెట్టి రొమాన్స్.. త్వరలోనే మరో బిగ్ బడ్జెట్ మూవీ!
గ్లామరస్ బ్యూటీ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండస్ట్రీలో అప్పట్లో సావిత్రి అందుకున్న స్టార్ రేంజ్ ను మళ్ళీ అనుష్క తన బాక్సాఫీస్ హిట్స్ తో అందుకుంది. ఆమెను చూసి సినిమాకు వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. అగ్ర హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకోవడమే కాకుండా ఒక స్పెషల్ మార్కెట్ ను సెట్ చేసుకుంది. ఇక స్వీటీ ఎంత కూల్ గా కనిపిస్తుందో అందరికి తెలిసిందే. ఇక వెండితెరకు చాలా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఆల్ మోస్ట్ ఒక కథ అయితే సెట్టయినట్లు టాక్ వస్తోంది. ఇక ఆమెతో ఒక యువ హీరో కూడా నటిస్తాడట.

డిఫరెంట్ పాత్రలు..
మొదట నాగార్జున సూపర్ సినిమా నుంచి మొదలుకొని మొన్న వచ్చిన సైరా వరకు ఆమె చేసిన ప్రతి పాత్ర కోసం ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఆ పాత్రలన్నీటి కంటే మరింత వినూత్నంగా నెక్స్ట్ సినిమాలో కనిపించాలని అనుష్క సరికొత్తగా రెడీ అవుతుంటుంది. అనుష్క శెట్టి వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. బాహుబలి తరువాత మెయిన్ లీడ్ లో ఆమె కేవలం రెండే సినిమాలు చేసింది.

ఆఫర్స్ ఎన్నో వస్తున్నా..
ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. కానీ అమ్మడు కేవలం తనకు సెట్టయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది. భాగమతి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక భాగమతి సినిమా తరువాత అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో రూపొందిన సైలెన్స్ సినిమాలో అనుష్క ఒక మూగమ్మాయిలా నటించింది.

నిశ్శబ్దం.. డిజాస్టర్
నిశ్శబ్దం సినిమాలో అనుష్క పాత్రకు గుర్తింపు బాగానే వవచ్చినప్పటికీ సినిమా ఓటీటీలో విడుదలై దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఆడియెన్స్ కు ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదు. ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం ఆడియెన్స్ కు మంచి కిక్కివ్వాలని అనుష్క తన స్టైల్ ను పూర్తిగా మార్చనున్నట్లు సమాచారం.

నవీన్ పోలిశెట్టితో అనుష్క
ఇక త్వరలో రమేష్ అనే ఒక్క కొత్త దర్శకుడితో అనుష్క బిగ్ బడ్జెట్ సినిమాతో బిజీ కానుంది. అయితే ఆ సినిమాలో యువ హీరో నవీన్ పొలిశెట్టి అనుష్కకు జోడిగా నటించనున్నట్లు టాక్ వస్తోంది. కొత్త సినిమా కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టినట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ లోనే ఆ సినిమా రూపొందనుంది. ఆ ప్రొడక్షన్ లో అనుష్క బాగమతితో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్కకు ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదట. ముందుగా ఈ సినిమా పాత్రకు సరైన న్యాయం చేయాలని అందుకే వేరే సినిమాలను ఓకే చేయడం లేదట. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











