గెస్ట్ రోల్‌లో అనుష్క.. చిరంజీవి కోసమేనా!
భాగమతి చిత్రం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతోంది. కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం అనుష్క విదేశాలకు వెళ్లి బరువు తగ్గింది. ఇప్పుడిప్పుడే అనుష్క కొత్త చిత్రాలని అంగీకరిస్తోంది. తాజాగా అనుష్కకు సంబందించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది. ప్రతిష్టాత్మకమైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా నరసింహారెడ్డిలో అనుష్క స్పెషల్ రోల్ లో మెరవబోతోందనే టాక్ వినిపిస్తోంది.
కొన్ని నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి అనుష్కని ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో అనుష్క కూడా కాదనలేకపోయిందట. ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కి బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా అనుష్క చేరికతో సైరాపై మరింత హైప్ పెరగడం ఖాయం.

అనుష్క పాత్ర గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తొలి సారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఈ ఏడాది దసరాగా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోందనేది లేటెస్ట్ టాక్ .


Click it and Unblock the Notifications











