సీనియర్ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా పని ముగించిన అనుష్క శెట్టి!

దక్షిణాది సినిమా దగ్గర చాలా మంది అగ్ర హీరోలు ఉన్నారు కానీ వారితో పాటుగా వారికి ధీటుగా కనిపించే హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారని చెప్పాల్సి. మరి హీరోయిన్ గానే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత తమకంటూ ఒక బెంచ్ మార్క్ ని సెపరేట్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నప్పటికీ వారిలో టాలీవుడ్ అండ్ సౌత్ సెన్సేషనల్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. మరి అనుష్కకి మన తెలుగులో ఉన్న మార్కెట్ కూడా ఇప్పుడు వేరు.

కాగా కొంత కాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె నుంచి సినిమా వస్తే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. అలా గత ఏడాదిలో తన నుంచి వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా మంచి విజయాన్ని సాధించి లాభాలు కూడా అందించింది. అయితే అనుష్క బాహుబలి లాంటి సెన్సేషనల్ సక్సెస్ ని చూసిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి భారీ హంగులకి పోలేదు.

Anushka shetty quietly completed her shoot with director krish

అక్కడ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తూ కొంచెం సమయాన్ని ఎక్కువే తీసుకుంటూ ఆమె వచ్చింది. కాగా ఇలా స్లో గానే సినిమాలు చేస్తూ వస్తున్న అనుష్క మిస్ శెట్టి తర్వాత అనుష్క ఊహించని విధంగా రెండు సినిమాలు సైలెంట్ గా ఓకే చేసేసింది అలాగే వీటిలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ సినిమా ఒకటి.

అయితే "ఘాటీ" పేరిట చిత్రీకరణ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసిన భారీ సినిమా "హరిహర వీరమల్లు" లేట్ అవుతున్న తరుణంలో అనుష్కతో స్టార్ట్ చేసేసారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ఇప్పుడు పూర్తయిపోవచ్చిందట. అలాగే అనుష్క తన పోర్షన్ షూటింగ్ మొత్తాన్ని చేసేసినట్టుగా తెలుస్తోంది. ఇది మాత్రం ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

Anushka shetty quietly completed her shoot with director krish

ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమన్నా ఉంది అంటే అది పవన్ తో క్రిష్ ఆ వీరమల్లు సినిమా స్టార్ చేసిన ఈ గ్యాప్ లో తను ఆ సినిమా కాకుండా పూర్తి చేసేసిన రెండో సినిమా ఇది. దీనితో ఆ సినిమా ఎప్పుడు రావాల్సిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అనుష్క సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే క్రిష్ తో అనుష్క వేదం సినిమా తర్వాత రెండోసారి వర్క్ చేస్తుండడం విశేషం. దీనితో ఘాటీ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా కాకుండా స్వీటీ తన కెరీర్ లో సోలోగా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన "భాగమతీ" కి సీక్వెల్ ని కూడా స్టార్ట్ చేసేసింది. ఈ సినిమా పనులు కూడా సైలెంట్ గా అయిపోతున్నాయి అని ఆ మధ్య సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన అప్డేట్ వైరల్ గా మారింది. మరి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.

More from Filmibeat

Read more about: anushka ghaati krish
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X