Anushka Shetty: పెళ్లి‌ రూమర్స్‌పై అనుష్క ఆగ్రహం... హీరోలను అలా చేయగలరా అంటూ వార్నింగ్

ఇండియాలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉంటారు అగ్ర కథానాయిక అనుష్క శెట్టి. ఆమె పెళ్లి గురించి అభిమానులు, సినీ ప్రముఖులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనుష్క పెళ్లికి సంబంధించి నిత్యం మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. తాజాగా గత కొద్దిరోజులుగా స్వీటీ పెళ్లికి సంబంధింది రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తన వివాహం గురించి వస్తున్న ఊహాగానాలపై అనుష్క శెట్టి సీరియస్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

2005లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కన్నడ కస్తూరి అనుష్క శెట్టి. తొలినాళ్లలో అందాల ఆరబోతకే పరిమితమైన స్వీటీ జీవితాన్ని అరుంధతి మలుపు తిప్పింది. అరుంధతి, జేజమ్మగా రెండు క్యారెక్టర్లలో ఒదిగిపోయిన అనుష్క ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాటి నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పంచాక్షరి, నాగవల్లి, భాగమతి, రుద్రమదేవి చిత్రాలతో దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా అవతరించారు.

Anushka Shetty Reacts Strongly to Marriage Rumors Team Issues Official Statement

సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆమె కెరీర్‌కు సైజ్ జీరో మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగారు అనుష్క. కానీ తిరిగి వెయిట్ లాస్ అయ్యేందుకు ఎంతో శ్రమించారు. అయితే ఫలితం మాత్రం శూన్యం. పెరుగుతున్న వయసు, కొత్త భామల రాకతో అనుష్కకు ఆఫర్లు కూడా తగ్గాయి. సినిమాలు చేసినా చేయకపోయినా అనుష్క క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. గతేడాది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటి అనుష్కకు షాకిచ్చింది. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో స్వీటీ నటిస్తున్నారు.

20 ఏళ్ల కెరీర్‌లో అనుష్క శెట్టిపై ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. పలువురు స్టార్స్‌తో ఆమెకు సంబంధం అంటగట్టారు. సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్‌ పేర్లు అనుష్క బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో వినిపించాయి. వీరిలో ఎక్కువగా ప్రభాస్‌తో ఆమెను లింక్ చేస్తూ పుకార్లు వినిపించాయి. గత కొద్దిరోజులుగా అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి నిశ్చయమైందని, త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగుతుందని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై అనుష్క శెట్టి టీమ్ స్పందించింది.

అనుష్క పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒకరి వ్యక్తిగత జీవితంపై వార్తలు రాసేముందు అది నిజమా? కదా? అనేది కూడా చూడటం లేదు. అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రసారం చేయడం మంచి పని అనిపించుకోదు. అన్నింటిలోకి అనుష్క వయసును పదే పదే ప్రస్తావించడం బాధను కలిగిస్తోంది. 44 నెంబర్‌ను ఎందుకు అంతలా హైలైట్ చేస్తున్నారు. వయసు ఆమె సమస్య అయితే హీరోల వయసు విషయంలోనూ ఇలాగే ఉత్సాహంగా వ్యవహరించగలరా? మహిళల విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.

ప్రతిభ, గౌరవంతో తన కెరీర్‌ను అనుష్క నిర్మించుకున్నారు. పీఆర్ స్టంట్స్‌కు అనుష్క దూరం. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలను బయటపెట్టాలని అనుకోరు.. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయడం దారుణం. వివాహం అనేది వ్యక్తిగతం.. వ్యూస్ కోసం సంచలనంగా మార్చొద్దు. హద్దుల్లో ఉంటూ.. వార్తలను ప్రచురించే ముందు నిజాలను నిర్ధారించుకోండి. హీరోయిన్లను హీరోలతో సమానంగా గౌరవించండి అని అనుష్క టీమ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: anushka shetty movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X