మైనస్ డిగ్రీల చలిలో అనుష్క సినిమా షూటింగ్!

అనుష్క భాగమతి తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది. భాగమతి చిత్రం 2018 జనవరిలో విడుదలయ్యింది. అంటే దాదాపుగా అనుష్క ఏడాది కాలంగా కెమెరాకు దూరంగా ఉంటోంది. ఆ మధ్యన విదేశాలకు వెళ్లి కాస్త బరువు తగ్గి నాజూకుగా మారింది. ప్రస్తుతం అనుష్క కోనవెంకట్ సమర్పణలో, హేమంత్ మధుకర్ దర్శత్వంలో తెరకెక్కే చిత్రానికి రెడీ అవుతోంది. త్వరలో ఈ చిత్ర ప్రారంభం కానుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు, మాధవన్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఇటీవల కోనవెంకట్ విదేశాల్లో కొన్ని లొకేషన్స్ ని ఫైనల్ చేశారు. వాటిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు కుడా ఉన్నాయని కోన వెంకట్ తెలిపారు.

Anushka Shetty ready for her new movie shoot which is presented by Kona venkat

ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ పరిసిలిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు హాలీవుడ్ నటులు కుడా ఈ చిత్రంలో నటించబోతునట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు. అనుష్కకు తెలుగుతో పాటు తమిళంలో కుడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ చిత్రంలో అనుష్క మేకోవర్ కసరత్తులు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X