బాలకృష్ణతో మూవీ.. నా జీవితంలో అతి పెద్ద తప్పు.. అనుష్క శెట్టి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయడం లేదు. తన క్రేజ్ తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రంతో అనుష్క శెట్టికి ఇండియా వైడ్ గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి భారీ క్రేజ్ పెరిగింది. దాంతో అనుష్క కెరీయర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అనుష్క నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేస్తుందని అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరియర్ ను నడిపిస్తోంది.

'బాహుబలి', 'బాహుబలి 2' తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడాపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో భాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాల్లో నటించి అలరించింది. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
అనుష్క శెట్టి కెరీయర్ బిగినింగ్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి 'ఒక్క మగాడు' అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవీఎస్ చౌదరి ద్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు' కాపీరైట్స్ తో సినిమాను తెరకెక్కించారు. కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలను కూడా అందుకుంది.
అయితే, అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్ లో మాత్రం తను కెరీయర్ లో ఆ సినిమాలో నటించినందుకు కాస్తా అప్సెట్ అయ్యారని చెప్పారంట. ఆ మూవీలో తన పాత్ర ఎందుకుందో అస్సలు తనే తెలియలేదని, ఆ సినిమాలో చేయడం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందంట. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి 'సైరా నర్సింహారెడ్డి' కామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం 'ఘాటీ' అనే చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. అలాగే మలయాళంలో 'ఖతనార్' అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2' ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. చివరిగా 'డాకూ మహారాజ్'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











