నా వల్ల కాదంటూ ఏడ్చేశా.. ఆ సమయంలో ధైర్యం చెప్పారు: అనుష్క
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ అనుష్క నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాది అగ్రతారగా వెలుగొందుతున్న ఈ బ్యూటీ.. 'సూపర్' సినిమాతో సినీ గడపతొక్కి ఆ తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.
'సూపర్' సినిమాలో ఓ పాటకు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ ఎలా చేయాలో తెలిసేది కాదని, ఆ టైమ్‌లో తన వల్ల కాదు.. తాను చేయలేనని ఏడ్చానని చెప్పింది అనుష్క. దీంతో పది రోజులైనా టైమ్ తీసుకుని రిహార్సల్స్ చేయాలని చిత్రయూనిట్ వెన్నుతట్టారని గుర్తుచేసుకుంది. డాన్స్ వచ్చినపుడే చేద్దామని వారు తనకు ధైర్యం చెప్పారని అనుష్క చెప్పుకొచ్చింది. సూపర్ యూనిట్ అంతా తనను ఎంతో ప్రేమగా చేసుకుందని తెలిపింది.

మరికొద్ది రోజుల్లో అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క మూగ కళాకారిణిగా కనిపించనుంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కారోనా ఎఫెక్ట్ తగ్గితే చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











