twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోకు చేరువవుతున్న అనుష్క.. ఇంతకు ఏం జరిగిందంటే!

    |

    హీరో హీరోయిన్స్ కాంబినేషన్స్ లో వచ్చే సినిమాలకు ఒకప్పుడు క్రేజ్ బాగానే ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో అలాంటి రొటీన్ ఫార్ములాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కేవలం ఒకరిద్దరు స్టార్స్ మాత్రమే రెండవ సారి నటిస్తే ఆడియెన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. హీరోయిన్స్ ని రిపీట్ చేయడం మన హీరోలు స్లోగా తగ్గిస్తున్నారనే చెప్పాలి. ఇక అనుష్క 12 ఏళ్ల తరువాత ఒక స్టార్ హీరోతో మళ్ళీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    చాలా కాలం తరువాత..

    చాలా కాలం తరువాత..

    బాహుబలి బ్యూటీ అనుష్క దాదాపు టాలీవుడ్ లోని మాస్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. మెగాస్టార్ బాలయ్యల సరసన హీరోయిన్ గా చేయకపోయినా స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇక ఆ తరువాత ఎదో ఒక విదంగా నేటితరం హీరోలతో కూడా ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక చాలా కాలం తరువాత ఒక మాస్ హీరోతో మళ్ళీ ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆ హీరోతో..

    ఆ హీరోతో..

    అనుష్క శెట్టి సూపర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె కెరీర్ మొదటి నుంచి అనేక రకాల రూమర్స్ ని ఎదుర్కొంటోంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికి వాటి గురించి మెల్లగా మర్చిపోతోంది. అయితే 12 ఏళ్ల క్రితం ఒక మాస్ హీరోతో కూడా ఆమె లవ్ ఉన్నట్లు రూమర్స్ బాగానే వచ్చాయి. ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ హీరో గోపిచంద్.

    షాకింగ్ రూమర్స్..

    షాకింగ్ రూమర్స్..

    లక్ష్యం, శౌర్యం అనే సినిమాల తరువాత అనుష్క, గోపిచంద్ జోడికి అప్పట్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు రూమర్స్ డోస్ కూడా పెరిగింది. ఇద్దరి మధ్య ఎదో ఉందని రూమర్స్ రావడం అందరిని షాక్ కి గురి చేసింది. కానీ గోపిచంద్ మంచి హీరో కావడంతో ఎక్కువకాలం ఆ రూమర్స్ నిలవలేదు. కానీ అనుష్క ఆ రూమర్స్ కారణంగా గోపిచంద్ ని దూరం పెట్టిందని, ఆ తరువాత అతనితో నటించే అవకాశం వచ్చినా కూడా అందుకు ఒప్పుకోలేదని టాక్ కూడా వచ్చింది.

    Recommended Video

    Anushka Shetty's Nishabdham To Release On Amazon Prime Video
     12 ఏళ్ల తరువాత..

    12 ఏళ్ల తరువాత..

    ఇక ఇన్నాళ్ళకు మళ్ళీ అనుష్క , గోపిచంద్ కలిసి నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో గోపిచంద్ అలివేలు వెంకటరమణ అనే సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్, కీర్తి సురేష్ ని అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు తేజ అనుష్కను సంప్రదించినట్లు సమాచారం. అనుష్క కూడా ఒప్పుకుందనే టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Craze was once the heroine's heroine's combination of films. But nowadays such routine formulas are not a big workout. Interest in the audience is growing as only two stars are cast for a second. Repeat Heroines Our heroes are slow. Anushka seems to have given the green signal to reunite with a star hero after 12 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X