Anushka Shetty: జేజమ్మ కొత్త అవతారం.. ఘాటి ఫస్ట్ లుక్ చూస్తే గూస్ బంబ్స్ పక్కా..
Anushka Shetty: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒక్కరు. చాలా సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు కెరీర్ లో అరుంధతి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఇక బాహుబలి సినిమాతో అమ్మడు రేంజ్ అమాంతం పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకుంది స్వీటీ. ఆ తర్వాత లేడీ ఓరియెటెండ్ మూవీలో దుసుకోపోతుంది. పలు సినిమాలు చేసి బిజీ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు మూవీ కొత్త సినిమాకు సంబంధించిన న్యూ అప్డేట్ వచ్చింది. ఇంతకీ అనుష్క కొత్త సినిమా ఏంటీ ? ఈ మూవీ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటో ఓ లూక్కేయండి.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డైరెక్టర్ పూరిజగన్నాథ్ - హీరో నాగార్జున కాంబోలో తెరకెక్కిన సూపర్ సినిమాతో ఈ అమ్మడు తన కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాతో నటించి..మంచి పాపులర్టీని సంపాదించుకుంది. ఈ మూవీ తరువాత వరుస ఆఫర్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాలో లీడ్ లో నటించి, మెప్పింది. తెలుగు ప్రేక్షకుల మదిలో జేజమ్మ గా నిలిచిపోయింది అనుష్క.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి - ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది అనుష్క. ఈ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ.. బిజీబిజీగా మారిపోయింది అనుష్క. గత ఏడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించి.. మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. అయితే నేడు (నవంబర్ 7న) అనుష్క బర్తేడే సందర్బంగా ఈ లేటేస్ట్ మూవీ నుండి మేకర్స్ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఆ మూవీ ఏంటో కాదు.. సక్సెస్ పుల్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఘటి'. ఈ మూవీలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీని యూ.వీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ లేడీ ఓరియెంట్ మూవీకి 'ఘాటి' అనే టైటిల్ ఖరారు చేశారు.

తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ లో అనుష్క పెద్ద చుట్ట కాలుస్తూ.. ముఖం నిండా రక్తపు మరకలతో చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఎర్రని కళ్ళతో అనుష్క చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. నిజంగా ఆ లూక్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఈ సినిమాకి సంబందించిన గ్లింప్స్ సైతం ఈ రోజు 4:05 కి విడుదల చేస్తామని పోస్ట్ లో పేర్కొన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఈ సినిమా 2025 ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశాలు ఉంది.


Click it and Unblock the Notifications











