ఆదిపురుష్‌లో అనుష్కశెట్టి.. సీత పాత్రపై క్లారిటీ ఇచ్చిన స్వీటీ
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించింది. పలు సినిమాల రిలీజ్ వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్ అంక్షల కారణంగా పలు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. తాజాగా నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ద్వారా ఆడియెన్స్‌కు చేరువయ్యేందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనుష్క ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

సూపర్ నుంచి నిశ్శబ్దం వరకు
సూపర్ నుంచి నిశ్శబ్దం వరకు నా కెరీర్‌ను చూసుకొంటే గొప్పగా అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన వ్యక్తులతో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. అరుంధతి నా జీవితాన్ని మలుపు తిప్పింది. నా కెరీర్ ఇంతలా ఉండటానికి కారణం ఫ్యాన్స్, డైరెక్టర్లు, నిర్మాతలు. వారు నమ్మారు కాబట్టే నేను ఈ రేంజ్‌కు ఎదిగాను. వారి నమ్మకం లేకపోతే నా కెరీర్ ఈ రేంజ్‌లో ఉండేది కాదని చెబుతాను అని అనుష్క తెలిపారు.

లాక్‌డౌన్‌లో అలాంటి విషయాలు
ఎన్నో ఏళ్లుగా షూటింగుల బిజీతో నా గురించి నేను మరిచిపోయాను. లాక్‌డౌన్ సమయంలో నా గురించి నేను తెలుసుకోవడానికి వీలు కలిగింది. నా భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టడానికి అవకాశం లభించింది. చాలా సినిమాలు చూశాను. చాలా రకాలుగా స్క్రిప్టులు చదివాను. ఆ క్రమంలో మంచి సినిమాలను ఎంచుకొనే ఛాన్స్ లాక్‌డౌన్ ఇచ్చింది. త్వరలోనే రెండు సినిమాలు అనౌన్స్ అవుతాయి అని అనుష్క శెట్టి పేర్కొన్నారు.

నిశ్శబ్దం థియేటర్‌లోనే చూస్తే..
నేను ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం నిశ్శబ్దం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా విషయంలో థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మిస్ అవుతున్నామనే బాధకలుగుతున్నది. తప్పకుండా నిశ్శబ్దం చిత్రం థియేటర్‌లోనే చూడాల్సిన సినిమా. కాకపోతే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి దానిపై నాకు అసంతృప్తి ఏమీ లేదు అని అనుష్క పేర్కొన్నారు.
Recommended Video

ఆది పురుష్‌లో నటించడం లేదు
ఇక ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదు. ఆ చిత్రంలో సీతగా నటిస్తున్నారనే వార్త అవాస్తవం. ఇప్పటి వరకు నా వద్దకు అలాంటి ప్రపోజల్ రాలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి ఆదిపురుష్‌లో నటిస్తున్నాననే విషయం అబద్దం అని అనుష్క అన్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











