ప్రభాస్‌తో అనుష్క పెళ్లి ఫోటో.. అభిమాని ప్రశ్నకు జేజమ్మ దిమ్మతిరిగే సమాధానం
అరుంధతి, బాహుబలి, రుద్రమదేవీ, భాగమతి లాంటి చిత్రాలతో దక్షిణాది సూపర్‌స్టార్‌గా మారిన అనుష్కశెట్టి తాజాగా నిశ్శబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో అనుష్క శెట్టి ట్విట్టర్‌లో అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించారు. అయితే ప్రభాస్ గురించి అడిగిన ప్రశ్నలకు అనుష్క శెట్టి నిజాయితీగా, చాలా ఇంటెలిజెంట్‌గా సమాధానం ఇచ్చారు. అభిమానులు ఏమని ప్రశ్నలు అడిగారంటే..

ప్రభాస్‌తో అనుష్క పెళ్లి అంటూ
ప్రభాస్‌తో అనుష్క పెళ్లి అంటూ గతంలో పుకార్లు మీడియాలో జోరుగా ప్రచారం అయ్యాయి. బాహుబలి తర్వాత ఆ ఊహాగానాలు మరింత విజృంభిచాయి. అయితే అనుష్క గానీ, ప్రభాస్ గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వార్తలు మరింత ప్రచారం కావడంతో తమ మధ్య అలాంటి ఆలోచన లేదని వాటికి పుల్‌స్టాప్ పెట్టడానికి ప్రయత్నించారు. దాంతో ఆ గాసిప్స్‌కు తెరపడింది.

స్క్రిప్టు డిమాండ్ చేస్తే తప్పనిసరిగా
నిశ్శబ్దం ప్రమోషన్‌లో భాగంగా నెటిజన్లు, అభిమానులతో ముచ్చటిస్తుండగా ఆసక్తికరమైన ప్రశ్న అనుష్క ముందుకు వచ్చింది. బీహార్ నుంచి ఓ అభిమాని ప్రశ్న వేస్తూ.. నేను బీహార్ చెందిన వాడిని. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నేను బిగ్‌ఫ్యాన్‌ను. ప్రభాస్ గారితో మీరు ఒక్క సినిమా చేయండి. మీరిద్దరిది బ్యూటిఫుల్ జంట అని ట్వీట్ చేశారు. అందుకు అనుష్క ఆసక్తిగా సమాధానం ఇచ్చారు.

ప్రభాస్‌తో సినిమా చేయాలని
ప్రభాస్‌తో నటించాలని నాకు ఉంది. ఒకవేళ స్క్రిప్టు డిమాండ్ చేస్తే అందుకు నేను సిద్ధం. మా ముందుకు అలాంటి కథ వస్తే తప్పకుండా ప్రభాస్‌తో నటిస్తాను. మీరు మాపై కురిపిస్తున్న ప్రేమకు థ్యాంక్యూ. మీరు చూపిస్తున్న మాదిరిగానే ఎప్పుడూ మా ప్రేమ మీపై ఉంటుంది అంటూ అనుష్క ట్వీట్ చేశారు.

మిర్చిలో ప్రభాస్‌తో పెళ్లి సీన్
అనుష్కతో ట్విట్టర్‌తో ఛాటింగ్ సందర్భంగా మిర్చి చిత్రంలో ప్రభాస్‌తో పెళ్లి సీన్ ఫోటో ఒకటి షేర్ చేసి అనుష్కను కామెంట్ చేయమని అడిగారు. ప్రభాస్‌తో మీ పెళ్లి ఫోటో గురించి మీరు ఒక మాట చెప్పండి అంటూ నెటిజన్ ఓ ఫోటో షేర్ చేశాడు.
Recommended Video

పెళ్లి సీన్ గురించి చర్చిస్తుంటే
ట్విట్టర్‌లో అభిమాని షేర్ చేసిన ఫోటోకు చాలా తెలివిగా అనుష్క సమాధానం ఇచ్చారు. మిర్చి షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఆ సీన్ గురించి ఇద్దరం చర్చించుకొంటున్నాం. ఆ సమయంలో చాలా సహజంగా మా ఇద్దరిని కెమెరాలో బంధించారు. మిర్చి మూవీ నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రం. యూవీ క్రియేషన్‌లో ప్రమోద్, వంశీ, విక్కి నిర్మించిన తొలి చిత్రం అని అనుష్క కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











