మరో బిగ్ బడ్జెట్ మూవీలో అనుష్క.. ఈసారి నెవర్ బిఫోర్ అనేలా..

టాలీవుడ్ స్వీటీ అనుష్క బయట ఎంత కూల్ గా కనిపిస్తుందో అందరికి తెలిసిందే. అయితే వెండితెరపై కనిపిస్తే మాత్రం ఆమె పాత్రతో డిఫరెంట్ లుక్స్ తో షాక్ ఇస్తుంది. సూపర్ సినిమా నుంచి మొదలుకొని మొన్న వచ్చిన సైరా వరకు ఆమె చేసిన ప్రతి పాత్ర కోసం ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఆ పాత్రలన్నీటి కంటే మరింత వినూత్నంగా నెక్స్ట్ సినిమాలో కనిపించాలని అనుష్క సరికొత్తగా రెడీ అవుతున్నట్లు సమాచారం.

Recommended Video

Anushka Gets Emotional On The Sets, Reason Behind Anushka's Public Breakdown
వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది

వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది

అనుష్క శెట్టి వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. బాహుబలి తరువాత మెయిన్ లీడ్ లో ఆమె కేవలం రెండే సినిమాలు చేసింది. ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. కానీ అమ్మడు కేవలం తనకు సెట్టయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది. భాగమతి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదు.

ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదు.


ఇక భాగమతి సినిమా తరువాత అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో రూపొందిన సైలెన్స్ సినిమాలో అనుష్క ఒక మూగమ్మాయిలా నటించింది. అయితే ఆ సినిమాలో అమ్మడి పాత్రకు గుర్తింపు బాగానే వవచ్చినప్పటికీ సినిమా ఓటీటీలో విడుదలై దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఆడియెన్స్ కు ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదు.

 మంచి కిక్కివ్వాలని..

మంచి కిక్కివ్వాలని..


ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం ఆడియెన్స్ కు మంచి కిక్కివ్వాలని అనుష్క తన స్టైల్ ను పూర్తిగా మార్చనున్నట్లు సమాచారం. కాస్త బొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు ఫీట్నెస్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్. బొద్దుగా కాకుండా నాజూగ్గా 16ఏళ్ళ పడుచు పిల్లల దర్శనమివ్వనుందట. సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరు కనిపించని పాత్రలో నటించనున్నట్లు టాక్.

ఆ కథపై చాలా నమ్మకంతో

ఆ కథపై చాలా నమ్మకంతో

రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్న అనుష్క ఆ కథపై చాలా నమ్మకంతో ఉందట. బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టినట్లు సమాచారం. ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదట. ముందుగా ఈ సినిమా పాత్రకు సరైన న్యాయం చేయాలని అందుకే వేరే సినిమాలను ఓకే చేయడం లేదట. త్వరలోనే సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X