Tamannaah Vs Anushka Shetty: తమన్నా, అనుష్క మధ్య రసవత్తర పోటి.. మిల్కీ బ్యూటీతో జేజమ్మ నెగ్గేనా?
తెలుగు సినిమా దగ్గర ఒక రేంజ్ లో స్టార్డంలో టాప్ మోస్ట్ హీరోయిన్ ప్రెజెంట్ జెనరేషన్ లో కొంతమందే కనిపిస్తారు అని చెప్పవచ్చు. ఈ మధ్య రెండు మూడేళ్లు మహా అయితే ఐదేళ్లు వెనక్కి వెళితే కొత్త హీరోయిన్స్ కనిపిస్తారు కానీ ఒక దశాబ్దం కిందకి వెళితే తెలుగు సినిమాని షేక్ చేసిన బ్యూటీస్ కనిపిస్తారని చెప్పవచ్చు. ఒక కాజల్ అగర్వాల్, ఒక తమన్నా ఒక అనుష్క ఇలా టాప్ ప్లేస్ లలో మంచి స్టార్డం సహా ఆదరణను అందుకొని వీరు కొనసాగారు.
అయితే ఇక కెరీర్ అలా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకోకరు ఒకో టర్న్ తీసుకొని కొంచెం స్లో అయ్యారు. అలాగని సినిమాకి దూరం అయ్యిపోలేదు కానీ స్లో అయినా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఈ టాప్ బ్యూటీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా అలాగే అనుష్క నడుమ క్లాష్ పడేలా ఉందని చెప్పాలి.

కాగా ఇద్దరూ కూడా ఒకప్పుడు పలువురు స్టార్స్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ సోలోగా కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క అయితే ఎప్పుడు నుంచో సినిమాలు సోలోగా చేస్తుంది. ఇప్పుడు వరకు కూడా తన సినిమాలకి మంచి ఆదరణ ఉందని తెలిసిందే. కాగా కొన్నేళ్ల పాటు తెలుగు సినిమాకి దూరంగా ఉన్న తమన్నా ఇపుడు మళ్ళీ రావడం రావడంతోనే తనపై కూడా సోలో సినిమాతో రాబోతుంది.
కాగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈ ఇద్దరు టాప్ హీరోయిన్స్ నుంచి ఒకే సమయానికి తమ సోలో సినిమాలు రిలీజ్ కి రాబోతున్నాయి. ఇది వరకే అనుష్క నటిస్తున్న భారీ చిత్రం "ఘాటి" విడుదలని మేకర్స్ ఈ ఏప్రిల్ 18కి లాక్ చేసేసారు. ఇక ఈ డేట్ కి సరిగ్గా ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 17న తమన్నా నటిస్తున్న భారీ చిత్రం "ఓదెల 2"ని మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలకి కూడా గ్లింప్స్ వీడియోస్ తర్వాతే సాలిడ్ రెస్పాన్స్ నమోదు అయ్యింది. కాగా ఇపుడు ఈ రెండు సినిమాతో టాప్ హీరోయిన్స్ ఇద్దరూ క్లాష్ కి సిద్ధం అయ్యారు. ఒక టైంలో ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఒకే సినిమాలో నటించారు కానీ ఇపుడు యుద్దానికి సిద్ధం అవుతున్నారు. మరి ఈ పోరులో ఎవరు ముందుకొస్తారు ఎవరు వెనక్కి వెళ్తారు అనేది కేజ్రీగా మారింది.
ప్రస్తుతం అయితే సినీ వర్గాల్లో అనుష్క సినిమానే వెనక్కి వెళుతుననట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా డేట్ ఎప్పుడో ప్రకటించినప్పటకీ ఇంకా ప్రమోషన్స్ మొదలు కూడా పెట్టలేదు. దీనితో అనుష్క సినిమా తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇంకో పక్క వీరికి ఎంత సమయం ఉందో అటు తమన్నా సినిమా యూనిట్ కి కూడా అంతే సమయం ఉంది కాబట్టి సడెన్ గా అనుష్క సినిమా మేకర్స్ తమన్నా సినిమాకి షాకిచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. కాగా ఈ ఇద్దరు టాప్ బ్యూటీలు లాస్ట్ గా బాహుబలి సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











