సమంత దారిలో అనుష్క శెట్టి!
ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న పలువురు స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకామె. మరి ఆఫ్ స్క్రీన్ లో ఒక వారియర్ లా పోరాటం చేస్తూ వస్తున్నా సామ్ మరోసారి వార్తల్లో ఇప్పుడు వైరల్ గా మారి వినిపిస్తుంది.
కాగా సమంత గత కొన్ని రోజుల కితమే తన మాజీ భర్త టాలీవుడ్ ప్రముఖ హీరో నాగ చైతన్య రెండో పెళ్లి అనౌన్సమెంట్ తర్వాత వార్తల్లో మళ్ళీ హల్చల్ చేసింది. కాగా ఈ వార్తలని సామ్ పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ కావడంతో కొన్ని రోజులు మళ్ళీ ఈ వార్తలు ఫేస్ చేయాల్సింది వచ్చింది. కాగా ఈ కాంట్రవర్సీ తర్వాత సమంత మన తెలుగు సినిమా నుంచి ఒక ఊహించని స్టెప్ తీసుకొని వైరల్ గా మారింది.

ఇటీవల మలయాళ సినిమా దగ్గర రేపుతూ వస్తున్నా హేమ కమిటీని స్వాగతిస్తూ టాలీవుడ్ హీరోయిన్ గా మన తెలుగు సినిమాలో పెట్టిన WCC (విమేన్ ఇన్ సినిమా కలెక్టివ్) ఎప్పుడు నుంచో ఉన్నప్పటికీ తెలుగు సినిమాలో మహిళా ఆర్టిస్ట్ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నివేదిక లాంటివి ఎప్పుడూ ఇవ్వలేదని ఇప్పుడు ఆ రిపోర్ట్ ని సబ్మిట్ చెయ్యాలి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోస్ట్ చేసింది.
కాగా ఇప్పుడు సామ్ మొదలు పెట్టిన ఈ అంశం మరింత పెద్దది అయ్యేలా ఉందని చెప్పాలి. తన తర్వాత తనకి సపోర్ట్ గా టాలీవుడ్ మరో స్టార్ బ్యూటీ స్వీటీ అనుష్క కూడా డిమాండ్ చేసింది. సమంత పెట్టిన అదే పోస్ట్ ని తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి తెలుగు సినిమాలో మహిళా ఆర్టిస్ట్ లు ఎదుర్కొంటున్న సెక్సువల్ హెరాష్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని పారదర్శకంగా ఒక రిపోర్ట్ అందించాలని డిమాండ్ చేసింది.

దీనితో ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఈ అంశం ఊపందుకునేలా కనిపిస్తుంది అని చెప్పాలి. ఆల్రెడీ మలయాళ సినిమా దగ్గర హేమ కమిటీ దెబ్బకి చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి. మరి ఇప్పుడు తెలుగులో సామ్, అనుష్క లాంటి బిగ్ స్టార్స్ డిమాండ్ చేయడం కూడా స్టార్ట్ చేసారు. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. లేకపోతే సినీ పెద్దలు రాజకీయం చేసి ఇలాంటి వాటిని బయటకి రాకుండా చేస్తారో అనే ప్రశ్న కూడా చాలా మందిలో లేకపోలేదు.
కాగా ఇప్పుడు సమంత "సిటాడెల్ హనీ బన్నీ" వెబ్ సిరీస్ సహా హిందీలో మరో భారీ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ ని చేస్తుంది. ఇవి కాకుండా పలు సినిమాలకి కూడా సామ్ సైన్ చేయగా అనుష్క గత ఏడాది ఇదే సెప్టెంబర్ లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ ని అందుకుంది. ఇప్పుడు దర్శకుడు క్రిష్ తో "ఘాటీ" అనే సినిమా చేస్తుంది.


Click it and Unblock the Notifications











